శనివారం 04 జూలై 2020
Jayashankar - May 31, 2020 , 03:01:17

నయా బ్రిడ్జి పనులు షురూ

నయా బ్రిడ్జి పనులు షురూ

  • ఫాతిమా సమాంతర బ్రిడ్జికి మార్కింగ్‌
  • పనులు మొదలుపెట్టిన ఆర్‌అండ్‌బీ అధికారులు
  • తీరనున్న త్రినగరి ట్రాఫిక్‌ సమస్యలు
  • గతంలోనే రూ.78 కోట్లు మంజూరు
  • మూడేళ్లలో పనులు పూర్తి..

కాజీపేట, మే 30 : హన్మకొండ-హైదరాబా ద్‌ వెళ్లే దారిలో కాజీపేట ఫాతిమా బిడ్జి వద్ద మ రో బ్రిడ్జి నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రోడ్లు, భవనాల శాఖ జిల్లా అధికార యంత్రాంగం మార్కింగ్‌ చేసి, పరిసరాలను శుభ్రం చేసింది. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రభు త్వం సంకల్పించింది. కాజీపేటలో బ్రిడ్జి కార ణంగా ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయని గుర్తించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఫాతిమా బ్రిడ్జికి సమానంగా మరో బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నం. 539ను జారీ చేసింది. దీనికి రూ.78 కోట్ల నిధులు మంజూరు చేసి, నిధులు కూడా విడుదల చేసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాజీపేట ఫాతిమా బ్రిడ్జికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

స్థల సేకరణ, రై ల్వేశాఖ నుంచి అనుమతి తదితర కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఈ బ్రిడ్జి ని దాదాపు రూ. 37 కోట్ల వ్యయంతో ఎనిమిది వందల డబ్బు మీటర్ల పొడవు, పన్నెండున్నర మీటర్ల వెడల్పుతో వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్‌ సంస్థ నిర్మించనుంది.  మి గతా రూ. 41 కోట్ల నిధులతో స్థల సేకరణ, కేబు ల్‌, విద్యుత్‌, ఐదున్నర మీటర్ల సర్వీస్‌ రోడ్డు తదితర అవసరాలకు ఖర్చు చేయనుంది. కాజీపేట వైపున బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన ఎకరా 21 గుంటల భూమిని 35 ఏండ్ల లీజుకు గానూ రైల్వే శాఖకు రూ. 3.75 లక్షలు చెల్లించారు. ఫాతిమా జంక్షన్‌ వైపున బ్రిడ్జికి కావాల్సిన దాదాపు ఎకరం స్థలాన్ని క్రిష్టియన్‌ సంస్థలు ఇచ్చేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ బ్రిడ్జిని ర్మాణ పనుల కాల పరిమితి మూడేళ్లని, షెడ్యూల్‌ ప్రకారం 2021 డిసెంబర్‌ 31 వరకు పనులు పూర్తి కావాల్సి ఉందని  ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. ఈ సమాంతర బ్రిడ్జి పూర్తయితే ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి.

సమాంతర బ్రిడ్జికి మార్కింగ్‌

కాజీపేట పట్టణంలో ఇదివరకే ఉన్న బిడ్జిని, నూతనంగా నిర్మిస్తున్న మరో బ్రిడ్జి స్థలాన్ని జిల్లా రోడ్లు, భవనాల అధికార యంత్రాంగం శనివారం సందర్శించింది. అక్కడ పరిసరాలను జేసీబీతో శుభ్రం చేసి, మార్కింగ్‌ చేసింది. సందర్శించిన వారిలో ఎస్‌ఈ ఎం సత్యనారాయణ, ఈఈ రాజం, డీఈ మనోహర్‌, ఏఈ విష్ణు తదితర అధికారులు, కాంట్రాక్టర్‌ ఉన్నారు.


logo