మంగళవారం 07 జూలై 2020
Jayashankar - May 31, 2020 , 02:58:52

లక్నవరం కట్ట పక్కన మరో దారి

లక్నవరం కట్ట పక్కన మరో దారి

  • టీఎస్‌టీడీసీ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు 

గోవిందరావుపేట: లక్నవరంలో పర్యాటకుల సౌకర్యార్థం కట్ట పక్క నే మరో దారి ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్‌టీడీసీ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు తెలిపారు. ములుగు జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన శనివారం సాయంత్రం పరిశీలించారు. లక్నవరం సందర్శనకు వచ్చే పర్యాటకులు వాహనాల రద్దీతో ఇబ్బంది పడుతు న్న నేపథ్యంలో కట్ట పక్కనే మరో రహదారిని టూరిజం శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు వన్‌వే ద్వారా వచ్చి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. 2వ ఐలాండ్‌లో నూతనంగా నిర్మిస్తున్న 8 కాటేజీలను వచ్చే నెలలో అందుబాటులోకి తెస్తామని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. రెండో ఐలాండ్‌ నుంచి మూడో ఐలాండ్‌ వరకు మూడో వంతెన ఏర్పాటు చేస్తామని, ఆ పనులూ వచ్చే నెలలో పూర్తి చేస్తామన్నారు. ములుగులోని హరిత హోటల్‌, తాడ్వాయిలోని పలు కాటేజీల నిర్మాణం, బొగతలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్‌ చివరి వరకు అన్ని పనులూ పూర్తి చేస్తామని చెప్పారు. స్వదేశీ దర్శన్‌ పథకం ద్వారా మంజూరైన నిధులతో ములుగు జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీంతో జిల్లా పర్యాటక హబ్‌గా మారనున్నదని వెల్లడించారు. వెంట టీఎస్‌టీడీసీ ఎస్‌ఈ సరిత, సీఈలు రామకృష్ణ, యాక్రాంబ్ర, లక్నవరం యూనిట్‌ మేనేజర్‌ పుల్లారెడ్డి ఉన్నారు. logo