సోమవారం 25 మే 2020
Jayashankar - May 21, 2020 , 05:33:53

పాలకుర్తికి పర్యాటక శోభ

పాలకుర్తికి పర్యాటక శోభ

జిల్లాకు రూ.40కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌

బమ్మెర, పాలకుర్తి, వల్మిడిలో చురుగ్గా పనులు

ఫలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి కృషి 

పాలకుర్తి రూరల్‌ : ఎర్రబెల్లి కోరిక మేరకు ఏప్రిల్‌ 27, 2017లో బమ్మెర పోతన సమాధిని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, పెంబర్తి, ఖి లాషాపూర్‌, జఫర్‌గఢ్‌ కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రూ.40కోట్లు మంజూరు చేశారు. పాలకుర్తి సోమనాథుడి ఆల య అభివృద్ధికి రూ.10కోట్లు, పోత న స్మారక మందిరానికి రూ.7.50 కోట్లు, వల్మిడి ఆలయ అభివృద్ధికి రూ.5కోట్లు, పెంబర్తి హస్తకళల అభివృద్ధికి రూ.5కోట్లు, జఫర్‌గఢ్‌ కోట అభివృద్ధికి రూ.6 కోట్లు, రఘునాథ్‌పల్లి మండలం ఖిలాషాపూర్‌కు రూ.6 కోట్లు కేటాయించారు. ఇప్పటికే పోతన స్మారక మందిరాల స్లాబ్‌ నిర్మాణం పూర్తయింది. సోమనాథుడి కల్యాణ మండప పనులు సాగుతున్నాయి. వల్మిడిలో ఆలయంపై సత్రాలకు భూమిపూజ చేశారు. గత ప్రభుత్వాలు హామీలిచ్చి మాట తప్పాయి. ఈ ప్రాంత కవులను, వారసత్వ సంపదను పట్టించుకోలేదు. కానీ, మంత్రి దయాకర్‌రావు బమ్మెర ప్రాంతాన్ని బాసరగా తీర్చిదిద్దాలని సంకల్పించి సఫలీకృతుడు అయ్యారు. జనగామ జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు కీలకంగా వ్యవహరించారు. 

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా..

కవులకు పుట్టినిల్లయిన పాలకుర్తిని పర్యాట క కేంద్రంగా తీర్చిదిద్దాలన్నాదే నా కల. బమ్మె రను బాసర తరహాలో అభివృద్ధి చేస్తా. సీఎం కేసీఆర్‌ సహకారంతో జిల్లాను టూరిజం హబ్‌ గా మారుస్తా. బమ్మెర, పాలకుర్తి, వల్మిడిల్లో పర్యాటక పనులుపూర్తి అయ్యే దాకా విశ్ర మించ. కాంట్రాక్టర్లు పనులు త్వరగా పూర్తి చేయాలి. జీడికల్‌, పాలకుర్తి, ఆలయాల అభి వృద్ధికి కృషి చేస్తా. జిల్లాలోని రిజర్వాయర్లను టూరిస్టు ప్రాంతాలుగా మారుస్తా.

-ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి 


logo