సోమవారం 08 మార్చి 2021
Jayashankar - May 15, 2020 , 01:29:57

అన్నపూర్ణగా తెలంగాణ : గండ్ర

అన్నపూర్ణగా తెలంగాణ : గండ్ర

భూపాలపల్లి టౌన్‌, మే 14 : సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌, రాంపూర్‌, నాగారం, ఆజంనగర్‌, పంబాపూర్‌, దీక్షకుంట గ్రామాల్లో పర్యటించారు. కమలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాంపూర్‌లో జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పంబాపూర్‌లో ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకు కందిపప్పు, మాస్కులను పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీలకు సరుకులు అందజేశారు. ఇతర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభ, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌ యాదవ్‌, మందల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్టు-2లో జరుగుతున్న బ్లాస్టింగ్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలోని ఎస్సారెస్పీ కాల్వలు, కల్వర్టులపై బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులపై అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. చిట్యాల, రేగొండ, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, కాల్వల పూడికతీత, కల్వర్టులపై బ్రిడ్జిల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. సమావేశంలో ఎస్సారెస్పీ అధికారులతో పాటు కాంట్రాక్టర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

VIDEOS

logo