మంగళవారం 26 మే 2020
Jayashankar - May 14, 2020 , 02:45:29

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌

  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ/న్యూశాయంపేట, మే 13 : పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. బుధవారం నగరంలోని 38వ డివిజన్‌లోని విష్ణుప్రియ గార్డెన్‌లో  సుమారు 1850 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ కట్టడికి సీఎం ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నారన్నారు. అలాగే, 32వ డివిజ న్‌ న్యూశాయంపేట రామప్ప కాలేజీలో వెయ్యి నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్‌ మాడిశెట్టి అరుణ శివశంకర్‌ ఆధ్వర్యంలో వినయ్‌భాస్కర్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కా ర్యక్రమాల్లో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, డివిజన్‌ అధ్యక్షులు వెంకన్న,  వేణుగోపాల్‌, నాయకులు నాగరాజు, శ్రీధర్‌, గుండు సదానందం పాల్గొన్నారు.


logo