గురువారం 04 జూన్ 2020
Jayashankar - May 12, 2020 , 01:41:36

14న దేవాదుల నీరు రాక : చల్లా

14న దేవాదుల నీరు రాక : చల్లా

సంగెం/మామునూరు :  సంగెం మండలానికి ఈ నెల 14న దేవాదుల నీరు చేరనున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని దేవాదుల కాలువను బొల్లికుంట నుంచి ఆశాలపల్లి, రాంచంద్రాపురం, గవిచర్ల గ్రామాల మీదుగా కెనాల్‌పై బైక్‌ వెళ్తూ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం గవిచర్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చల్లా మాట్లాడారు. బొల్లికుంట వద్ద కాలువ నిర్మాణం చేస్తున్న సమయంలో తమకు నష్టపరిహారం ఇవ్వాలని పలువురు రైతులు కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో పనులు పూర్తి చేయగలిగామన్నారు. ధర్మసాగర్‌ నుంచి సంగెం మండలంలోని 14 గ్రామాల చెరువులు గ్రావిటీ కెనాల్‌ ద్వారా నింపుతామన్నారు. దీని ద్వారా 38,600 ఎకరాలకు సాగనీరందిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు కందకట్ల నరహరి, సాగర్‌రెడ్డి, కిశోర్‌యాదవ్‌, దోపతి సమ్మయ్య, దొనికెల శ్రీనివాస్‌, పూజారి గోవర్ధన్‌గౌడ్‌, అధికారులు పాల్గొన్నారు. 


logo