గురువారం 04 జూన్ 2020
Jayashankar - May 11, 2020 , 02:52:01

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

పెద్దవంగర/గోవిందరావుపేట/డోర్నకల్‌/ధర్మసాగర్‌/వేలేరు/రాయపర్తి: రైతులకు రుణమాఫీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటానికి తొర్రూరు మార్కెట్‌ మాజీ చైర్మన్‌, రైతుబంధు సమితి మండల సభ్యుడు కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్‌ కేతిరెడ్డి విక్రమ్‌రెడ్డి ఆదివారం పెద్దవంగరలో క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎంపీటీసీ వెంకట్రామయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సమ్మయ్య, రవి, రామ్మూర్తి పాల్గొన్నారు. అలాగే, సీఎం చిత్రపటానికి గాంధీనగర్‌లో గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బానోత్‌ వెంకన్న, మండల అధ్యక్షుడు మురారి భిక్షపతి, నాయకుడు ప్రసాద్‌ క్షీరాభిషేకం చేశారు. అలాగే, డోర్నకల్‌లోని రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నున్నా రమణ క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ వీరన్న, వైస్‌ చైర్మన్‌ కోటిలింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ చేరెడ్డి భిక్షంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కత్తెరశాల విద్యాసాగర్‌, కొత్త రాంబాబు, కొత్త వీరన్న, పోకల శేఖర్‌, వాజీద్‌, రహీం, గౌస్‌, బోడ హరి పాల్గొన్నారు. ధర్మసాగర్‌ మం డలం దేవునూర్‌లో సర్పంచ్‌ చిర్ర కవితకుమార్‌, వేలేరులో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు.  జెడ్పీటీసీ చాడా సరిత, వైస్‌ ఎంపీపీ అంగోత్‌ సంపత్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి, దండ విశ్వేశ్వర్‌రెడ్డి, జానీ, ప్రసాద్‌ పాల్గొన్నారు. రాయపర్తిలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు నేతృత్వంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.


logo