శనివారం 30 మే 2020
Jayashankar - May 11, 2020 , 02:27:41

ప్రభుత్వ చర్యలు భేష్‌

ప్రభుత్వ చర్యలు భేష్‌

  • వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ : కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్‌గా ఉన్నాయని వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా రెడ్‌ జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కార్పొరేటర్లు సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను దేశం మొత్తం ప్రశంసిస్తుందని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందిస్తున్నామని చెప్పారు. టోల్‌ ఫ్రీ సెంటర్‌కు కాల్‌ చేస్తే ఆహారం పంపించే ఏర్పాట్లు చేశామని మేయర్‌ తెలిపారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పిలుపులో భాగంగా మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్‌ పమేలా సత్పతి రంగంపేటలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు సీఎం సహాయ నిధికి రూ.1.17 లక్షలు విరాళం అందించారు. ఆదివారం మేయర్‌, కమిషనర్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతును కలిసి చెక్కు అందించారు.


logo