శనివారం 30 మే 2020
Jayashankar - May 10, 2020 , 02:39:41

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

భూపాలపల్లి టౌన్‌/అంబేద్కర్‌ సెంటర్‌/రేగొండ:  రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని అంబేద్కర్‌ సెంటర్‌, రేగొండలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. భూపాలపల్లి పట్ణణంలోని సుభాశ్‌ కాలనీలో బేతనీయ చర్చిలో ఏర్పాటు చేసిన సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. జిల్లాలోని పాస్టర్లందరికీ 25 కిలోల బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. ఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థల అధినేత నాయినేని సంపత్‌రావు ఆధ్వర్యంలో రేగొండలో ఏర్పాటు చేసిన  నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు సాంబమూర్తి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరాణి సిద్ధు, హరిబాబు, విజ్ఞాన్‌రావు, సంపత్‌యాదవ్‌, రవీందర్‌రెడ్డి, విజయ పాల్గొన్నారు.


logo