గురువారం 28 మే 2020
Jayashankar - Apr 27, 2020 , 01:16:31

దాతలు ముందుకు రావాలి

దాతలు ముందుకు రావాలి

  • ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ 

నయీంనగర్‌ : లాక్‌డౌన్‌ సమయంలో ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలను ఆదుకునేందుకు వివిధ సంఘాలు, దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ఆదివారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వరంగల్‌ ఎలక్ట్రిసిటీ అసోసియేషన్‌ సభ్యుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన మెకానిక్‌లకు దాస్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యలో మెకానిక్‌లకు నిత్యావసర సరుకులతో పాటు రూ.1500 నగదు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.  


logo