సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Apr 20, 2020 , 02:11:12

రక్షకుడు సీఎం కేసీఆర్‌..!

రక్షకుడు సీఎం కేసీఆర్‌..!

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ గ్రామంలో రైతులు సంబురాలు జరుపుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తన పొలంలో అధిక దిగుబడి రావడంతో రైతు బంధు సమితి సభ్యుడు సముద్రాల మధు ధాన్యం రాశిపై సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ‘తెలంగాణ రక్షకుడు’ అంటూ క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ వల్లే ఎన్నడూ లేని విధంగా ధాన్యం దిగుబడి వచ్చి రైతుల కళ్లల్లో ఆనందం కనిపించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాదు ధనుంజయ, జూలూరి సాంబయ్య, ఇంజపురి రాజు, సముద్రాల మల్లయ్య, రాము, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

-హసన్‌పర్తి

VIDEOS

logo