మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 09, 2020 , 02:30:47

సార్‌ భూపాలపల్లికి రండి..!ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే గండ్ర

సార్‌ భూపాలపల్లికి రండి..!ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్‌ జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : ‘దినదినాభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో టీఆర్‌ఎస్‌, మీకు (కేసీఆర్‌) ఎంతో ఆదరణ ఉంది. ప్రజలు, తాము మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. భూపాలపల్లికి జిల్లాకు రండి సార్‌..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుం ట్ల చంద్రశేఖర్‌రావుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకొని విరామ సమయంలో ముఖ్యమం త్రి కేసీఆర్‌ను ప్రత్యక్షంగా కలిసి భూపాలపల్లిని సందర్శించాలని అభ్యర్థించారు. భూపాలపల్లి ప్రాంతంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి, ఎకో పార్కు, సింగరేణి చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గనుల విస్తరణతోపాటు మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించాలంటూ ముఖ్యమంత్రిని రమణారెడ్డి కోరారు. అంతేకాకుండా భూపాలపల్లిలో బొగ్గు ఆధారిత పరిశ్రమలతోపాటు స్వయం ఉపాధి, సామూహిక ఉపాధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, వాటికి కూడా మీ వంతు ఆశీర్వాదం కావాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రమణారెడ్డి తెలిపారు. logo