సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 09, 2020 , 02:27:14

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

మల్హర్‌/మహదేవపూర్‌, మార్చి 08: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శమని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటే ష్‌ అన్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణితో కలిసి ఆదివారం మల్హర్‌ మండలంలో పర్యటించారు. మండలంలోని తాడిచెర్లలో సిం గిల్‌ విండో చైర్మన్‌ చెప్యాల రామారావు, వైస్‌ చైర్మన్‌ మల్క సూర్యప్రకాశ్‌, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయిం చారు.  అదేవిధంగా రూ.43 లక్షల వ్యయంతో నిర్మించిన సహకార సం ఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. నాగులమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం కొయ్యూరు నుంచి తాడిచెర్ల వరకు 200 మంది కార్య కర్తలు, ప్రజాప్రతినిధులతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణకు 60 ఏళ్లుగా పట్టిన దరిద్రాన్ని ఐదేండ్లలోనే వదిలించిన నేత కేసీఆర్‌ అన్నారు. రైతును రాజు చేయాలన్న దృఢ సంకల్పంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. మూడేండ్లలోనే ఇంత టి అధునాతన ప్రాజెక్టును పూర్తి చేసిన చ రిత్ర మరెక్కడా లేదన్నారు. ఉత్తర తెలంగాణలో 40 లక్షల ఎ కరాలకు సాగునీరు అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర సంక్షేమ పథకాలతో రైతులకు కొండంత అండగా నిలిచారన్నారు. రైతు సహకార సంఘం డైరెక్టర్లు కూడా రైతులే గనుక రైతులకు వెన్నంటి ఉం టూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలన్నా రు. ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి పాలన స్ఫూర్తిగా ప్రజలకు మరింత సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు. 

రైతు బాంధవుడు కేసీఆర్‌: పుట్ట మధు, జెడ్పీ చైర్మన్‌ 

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆనంతరం రైతులకు రైతు బంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గత ప్రభుత్వలు రైతులను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిదన్నారు.

ఇంటి పెద్ద కొడుకు కేసీఆర్‌ 

జక్కు శ్రీహర్షిణి, జెడ్పీ చైర్‌పర్సన్‌

వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు నెలనెలా పింఛన్‌ అందిస్తూ ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇంటికి పెద్ద కొడుకులా ఆదుకుంటున్నాడని భూపాలపల్లి జిల్లా  పరిషత్‌ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీ హర్షిణి రాకేశ్‌ ఆన్నారు. వరి ధాన్యం కొనుగోలులో ఏర్పడిన ఇబ్బందులను మంత్రుల సహకారంతో తొలగించామని అన్నా రు. కార్యక్రమంలో డైరెక్టర్లు మల్క రాజేశ్వరావు, మచెర్ల సురేశ్‌, సుంకు రాము, పొట్ల రాజమ్మ, నారా సారయ్య, వోన్న తిరుపతిరావు, ఇప్పు మొండి, బానోత్‌ సమ్మక్క, స్వరానాయ క్‌, బొమ్మన రమేశ్‌రెడ్డి, సెగ్గం రమేశ్‌, సర్పంచ్‌లు సుంకరి సత్యనారాయణ, సిద్ది లింగమూర్తి, కుమారస్వామి, మమత, నర్స య్య, ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, కాటారం సహకర సంఘం చైర్మన్‌ చల్లా నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ఆధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, మోడల్‌ పాఠశాల చైర్మన్‌ సుంకు లక్ష్మణ్‌, మాజీ జె డ్పీటీసీలు శీలం లక్ష్మయ్య, గోనె శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు కోట రవి, నాగేశ్వర్‌రావు, శ్రీశైలం, పౌడా ల నారాయణ, మండల యూత్‌ ఆధ్యక్షుడు జాగిరి హరీశ్‌, పడితల లింగారావు, దేవరనేని రాజేశ్వర్‌రావు, గుమ్మడి రవి, మల్లేశ్‌, సదానందం, సమ్మయ్య రాజయ్య పాల్గొన్నారు. 

పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రమాణస్వీకారం

మహదేవపూర్‌ మండలకేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో ఇటీ వల ఎన్నికైన పీఏసీఎస్‌ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, జెడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జ క్కు శ్రీహర్షిణి హాజరయ్యారు. పీఏసీఎస్‌ పాలకవర్గంతో ప్రమాణం చే యించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మహదేవపూర్‌ ఎంపీపీ బన్సోడ రాణిబాయి, జెడ్పీటీసీ గుడాల అరుణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్లా తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ శ్రీపతిబాపు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, కాటారం ఏంమ్‌సీ చైర్మన్‌ అంకారి భవాని, ఎంపీటీసీలు రేవెల్లి మమత, జయశ్రీ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పెండ్యాల అనిల్‌, డైరెక్టర్లు సవిత, ఇబ్రహీం, మాధవరావు, సుమన్‌, సమక్క, శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


logo