శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 09, 2020 , 02:26:24

నేటి నుంచి నాగులమ్మ జాతర

నేటి నుంచి నాగులమ్మ జాతర

మంగపేట మార్చి08: మంగపేట మండలం, రాజుపేట సమీపంలోని లక్ష్మీనర్సాపురంలో సోమవారం)నుంచి ఈనెల 14 వరకు వైభవంగా నిర్వహించే నాగులమ్మ జాతరకు ఆలయ పూజారుల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నాగులమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ పూజారులు, వడ్డెలు, దేవర బాలలు అమ్మవారి బండారి(పసుపు, కుంకుమ)ను అందజేశారు. మొదటి అమ్మవారికి అభిషేకాలు, 10న మండె మెలుగుట, 11న ఎర్రెట్టల గుట్ట నుంచి సడాలమ్మ రాక, గోదావరి నదీ స్నానాలు, 12న గండొర్రె గుట్ట నుంచి నాగులమ్మ రాక, (నిండు జాతర) ఇదే రోజున రాత్రి ఒంటి గంటకు రామకృష్ణస్వామి లోక కల్యాణార్థం అగ్ని గుండంలో నడవడం వంటి కార్యక్రమాలుంటాయని ఆలయ ట్రస్టీ, ప్రధాన పూజారులు బాడిశ రామకృష్ణస్వామి, బాడిశ నాగరమేశ్‌ తెలిపారు.

 13న భక్తులు మొక్కులు చెల్లించుట, 14న దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనున్నట్లు వారు పేర్కొన్నారు.  కాగా తెలుగు రాష్ర్టాలతో పాటుగా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి కూడా భక్తులు జాతరకు రానున్న దృష్ట్యా జాతర ప్రాంగాణంలో తాగు నీరు, వైద్య, లైటింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు పూజారుల కమిటీ బృందం, గిరిజన కుల పెద్దలు తెలిపారు. 


logo