ఆదివారం 24 మే 2020
Jayashankar - Mar 08, 2020 , 02:48:00

అడవుల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం

అడవుల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం

రేగొండ, మార్చి 07: క్షీణిస్తున్న అటవీ పునరుద్ధరణ, అడవుల పెంపకం, పచ్చ దనం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. పాండవుల గుట్టలను ఇంటర్నేషనల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేస్తానని పే ర్కొన్నా రు. రేగొండ మండలం భాగిర్ధిపేట శివారులో ఏ ర్పాటు చేసిన స్టాల్‌, అసిస్టెడ్‌ నేచురల్‌ రీజనరేషన్‌ ప్లాంటేషన్‌ను శనివారం కలెక్టర్‌తోపాటు వరంగల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) ఎంజే అక్బర్‌ సందర్శించారు. అనంతరం తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టలను పరిశీలించారు ఈసందర్భంగా కలెక్టర్‌, సీసీ ఎఫ్‌ మాట్లాడుతూ అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అడవులకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమనే విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. 


తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని పెంచేం దుకుగాను రెండు నెలల్లో జిల్లాలో వనదర్శిని కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపా రు.  ప్రకృతి అందాలకు నెలవైన పాండవుల గుట్టలకు ప్రపంచ గుర్తింపు తీసుక వస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో పురుషోత్తం, ఎఫ్‌డీవో వజ్రారెడ్డి, ఎఫ్‌ఆర్‌వో కోటేశ్వర్‌, సెక్షన్‌ ఆఫీసర్లు ప్రసాద్‌, రాజేందర్‌, ఫయాజ్‌తోపాటు  రామన్నగూడెం సర్పంచ్‌ భానోత్‌ బిక్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంత రం రూపిరెడ్డిపల్లి నుంచి జిల్లా కేంద్రం వరకు గల వరంగల్‌, సిరొంచ జాతీయ రహ దారిని శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌, డీపీవో చంద్రమౌలి, ఎంపీపీ పున్నం లక్ష్మి, ఎంపీడీవో అరుంధతి, సర్పంచ్‌ బండారి కవిత దేవేందర్‌, ఆధికారులు ఉన్నారు. 


ఎకో పార్కును సందర్శించిన కలెక్టర్‌ 

భూపాలపల్లి, నమస్తేతెలంగాణ: భూపాలపల్లి ప్రాంత ప్ర జలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎకో పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అటవీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎకో పార్కును కలెక్టర్‌, వరంగల్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్‌, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌ను పరిశీలించారు. పార్కు చాలా బాగుందని కితాబిచ్చారు. పార్కులో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ త్వరగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారివెంట జెడ్పీ సీఈవో శిరీష, డీఎఫ్‌వో పురుషోత్తం, జిల్లా హార్టికల్చర్‌ ఆఫీసర్‌ అక్బర్‌, డీపీవో చంద్రమౌళి, ఆర్డీవో వైవీ గణేశ్‌, చెల్పూర్‌, భూపాలపల్లి రేంజ్‌ ఆఫీసర్లు కోటేశ్వర్‌రావు, శ్రీనివాసన్‌ తదితరులున్నారు. logo