సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 06, 2020 , 02:59:36

కల్యాణ వైభోగమే..

 కల్యాణ వైభోగమే..

రేగొండ, మార్చి 05 : కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి క ల్యాణ మహో త్సవాన్ని గురువారం రాత్రి అంగరంగ వైభవం గా నిర్వహించారు. ముందుగా నరసింహస్వామి, లక్ష్మీదేవిలను వేర్వేరుగా పలకీపై ఆలయం నుంచి తీసుకొచ్చా రు. ఆలయ ఆవరణలో వేద పండితులు ఎదుర్కోళ్ల తంతును నిర్వహించారు. అనంతరం  మేళతాళాల మధ్య కల్యాణ మండపానికి తీసుకెళ్లా రు. మిరిమిట్లు గొలిపేలా రంగు, రంగుల విద్యుత్‌ దీపాలు, పూ లతో చూడముచ్చటగా అలంకరించిన మంటపంలో ప్రధాన అర్చకులు బుచ్చమాచార్యులు అధ్వర్యంలో భక్తుల జయజయ ధ్వానాల మధ్య వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వా మివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ వేడుకలను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో చైర్మన్‌ ఇంగే మహేందర్‌, ఈవో కే సులోచన, ట్రైనింగ్‌ ఐపీఎస్‌ బాలస్వామి, భూపాలపల్లి డీ ఎస్పీ సంపత్‌రావు, సీఐ సాయిరమణ, ఎస్సై కృష్ణ ప్రసాద్‌, ధర్మకర్తలు మాదాటి అనిత, కరుణాకర్‌రెడ్డి, గైని కుమారస్వామి, గండి తిరుపతి, జలేందర్‌, లింగయ్య, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్‌రావు, ఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థల అధినేత నాయినేని సంపత్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా  నిర్వహించారు. ఈమేర కు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.


సీసీ కెమెరాల ఏర్పాటు

మండలంలోని కొడవటంచ జాతరలో పోలీసులు  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముందుస్తు చర్యల్లో భాగంగా రేగొండ పోలీసులు గురువారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ ఎస్‌హెచ్‌వో బాలస్వామి, చిట్యాల సీఐ సాయిరమణ, రేగొండ ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌ ఉన్నారు.logo