మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Mar 05, 2020 , 03:03:12

మొదటి రోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

మొదటి రోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

కలెక్టరేట్‌, మార్చి 04 : మొదటి రోజు జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి 8 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ సెట్‌ పేపర్‌-ఏ ను ఇంటర్‌ బోర్డు ఎంపిక చేసింది. అధికారులు సెట్‌ పేపర్‌-ఏను పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 1959 మందికి 1848 మంది విద్యార్థులు హాజరయ్యారు. 111 మంది గైర్హాజరైనారు. ఒక్కో కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 145 మంది పరీక్ష నిర్వహకులను నియమించారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారానికి బోర్డు అధికారులు ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, ఆర్డీవో వైవీ గణేష్‌ భూపాలపల్లి మండలంలోని పవిత్ర జూనియర్‌ కాలేజీ తేజస్వీని (గాంధీ)జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలలో ముగ్గురు ైప్లెయింగ్‌ స్కాడ్స్‌ ఎప్పటికప్పుడు మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా తనిఖీలు నిర్వహించారు.


logo
>>>>>>