బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 05, 2020 , 03:00:39

పట్నం మెరిసింది.. పల్లె మురిసింది

పట్నం మెరిసింది.. పల్లె మురిసింది

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. పది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. దీంతో భూపాలపల్లి పట్టణం మొత్తం రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావుల మార్గనిర్ధేశంలో 1, 2 విడతల్లో పల్లె ప్రగతిని నిర్వహించిన అధికార యం త్రాంగం అదే స్పూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలో 30 వార్డుల్లో ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేసి ఎంతో మందుచూపుతో  పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 వార్డుల్లో పట్టణ ప్రగతి, మూడో దఫా పల్లె ప్రగతితో ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడాలేకుండా జన సందడితో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. టన్నుల కొద్ది చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించారు. పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగించారు. మురికి కాల్వలను శుభ్రం చేయించారు. యంత్రాల సహాయంతోపాటుగా పల్లెల భాగస్వామ్యంతో కూలీలను కూడా తీసుకొని పల్లె, పట్టణాలను శుభ్రం చేయించారు. 


పట్నం మెరిసేలా.. పల్లె మురిసేలా ఈ కార్యక్రమాలు సాగాయి. ప్రభుత్వ స్థలాలే కాకుండా ప్రైవేటు స్థలాల్లో కూడా చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు లేకుండా చేశారు. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిపెట్టారు. గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డులను యూనిట్లుగా తీసుకొని ఆ వార్డు సభ్యుడు లేదా కౌన్సిలర్‌, ప్రత్యేకాధికారి, కమిటీల సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను పూర్తి చేశారు. పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా ఎక్కడ కూడా చెత్త లేకుండా చేశారు. మురికి కాల్వల్లో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు బ యటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశా రు. ఇక పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్‌ వైర్లు వేలాడడం, మూడో వైరు ఏర్పాటు, కాలం చెల్లిన ఇనుప స్తంభాల స్థా నంలో సిమెంట్‌ స్తంభాల ఏర్పాటు, గ్రామాల్లో వీధి దీ పాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవడం, ఇక శు ద్ధి జలాలను అందించడం తోపాటు తాగునీటి సమ స్య తలెత్తకుండా చూ శారు. పాడుబడ్డ బావులను అక్కడక్కడ పూడ్చివేశారు. శిథిలమై ఇంకా మిగిలిపోయిన పాత భవనాలను నేలమట్టం చేయించారు. పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చే పనిలో మొక్కవోని దీక్షతో అధికారులు, ప్రజాప్రతినిధులు అదే లక్ష్యంగా ముందుకు సాగారు. పది రోజుల్లో జిల్లా కలెక్టర్‌ నుంచి మొదలు గ్రామ పంచాయతీ బిల్‌ కలెక్టర్‌ వరకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో విజయవంతమయ్యారు. చివరి రోజు బుధవారం జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణ ప్రధాన రోడ్లను సందర్శించారు. 


స్థలాల గుర్తింపు

జిల్లాలోని భూపాలపల్లి పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా స్థలాల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో, పట్టణాల్లో డంపింగ్‌ యార్డులకు స్థలాలు, సామూహిక సౌచాలయాల నిర్మాణాలకు కాంప్లెక్స్‌, క్రీడా స్థలాలకు, మార్కెట్లకు, వైకుంఠ ధామాలకు స్థలాల గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ అధికారులు అదే పనిలో ఉన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ముగిసినప్పటికీ వీటి ప్రాధాన్యతను గుర్తించి ఇంకా గ్రామాల్లో స్థలాలు దొరకని నేపథ్యంలో వాటి అన్వేషణలో ఉన్నారు. అవాంతరాలను అధిగమించి వీటికి అవసరమైన స్థలాలను సేకరించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనులు కొనసాగుతున్నాయి. అవే పనులు సాగుతున్నాయి. 


భూపాలపల్లిపై డ్రోన్‌ నిఘా

పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలాల గుర్తింపు, చెత్త నిల్వల తొలగింపు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా డ్రోన్‌ కెమెరాను ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా డ్రోన్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, తీసుకోవాల్సిన చర్యలపై తగిన ఆదేశాలు ఇవ్వడం సులభతరంగా మారింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా భూపాలపల్లి జిల్లాలో డ్రోన్‌ పరిరక్షణలో ఈ పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిషితంగా పరిశీలిస్తూ అమలు చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారం, అవసరమైన మంజూరీలు ఇవ్వడం, దానికి తోడు నిధులు కేటాయించే సర్వాధికారాలు ఉండడంతో భూపాలపల్లి పట్టణ ప్రగతి విజయవంతంగా ముందుకు సాగింది. 


పల్లె నిద్ర

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు భూపాలపల్లి జిల్లాలో అధికార యంత్రాంగం పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. పట్టణ, పల్లె ప్రగతితో పాటుగా పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలతో అనుబంధం పెరుగడంతో పాటుగా వారితో మమేకమై సమస్యలు తెలుసుకొని పరిష్కరించే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన పల్లె నిద్రలో భాగంగా శనివారం రాత్రి గ్రామాలకు వెళ్లిన అధికారులు గ్రామాల్లోనే బస చేసి ఆదివారం సెలవు దినమైనప్పటికీ ఉదయాన్నే ప్రజలతో కలిసి మాట్లాడారు. గ్రామ చావళ్ల వద్ద, గ్రామ పంచాయతీల వద్ద, గ్రామాల్లోని జన సంచార కేంద్రాల్లో అధికారులు ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని పల్లె నిద్ర కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. దీంతో జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా అధికార యంత్రాంగం విజయవంతం చేసింది. 


ఏ రోజుకారోజు సమస్యలు.. సుడిగాలి పర్యటనలు

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, పల్లె నిద్ర కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీంతో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఈ కార్యక్రమాల అమలుకు అకుంఠిత దీక్షతో ప్రణాళికబద్దంగా పని చేసింది. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను డివిజన్‌, జిల్లా అధికారులు సమీక్షించారు. వీటికితోడుగా కలెక్టర్‌, స్పెషలాఫీసర్లు సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూపాలపల్లి జిల్లాను రెండుసార్లు సందర్శించారు. కాలి నడకన వీధుల్లో పర్యటించారు. పట్టణ ప్రగతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మహిళా మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా జిల్లాను సందర్శించి పట్టణ ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఏరోజు కారోజు అధికార యంత్రాంగం సమీక్షలు, సమావేశాలు, స్థానిక శాసనసభ్యులు రమణారెడ్డి సందర్శనలు, రాష్ట్ర మంత్రుల ఆకస్మిక పర్యటనలతో పట్టణ ప్రగతి విజయవంతంగా సాగింది. 


logo
>>>>>>