గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 01, 2020 , 03:14:26

ప్రగతి పండుగ..!

ప్రగతి పండుగ..!

జయశంకర్‌ జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లాలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఆరో రోజు శనివారం పట్టణ ప్రగతి పనులను ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కలెక్టర్‌ అజీమ్‌ పరిశీలిం చారు. పట్టణ ప్రగతిలో భూపాలపల్లిని ముందువరుసలో నిలపాలని, దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఆయా వార్డుల్లో కలెక్టర్‌, ఎమ్మెల్యే పర్యటించారు. హనుమాన్‌ నగర్‌, లక్ష్మీనగర్‌, శాంతినగర్‌లో పాలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని డ్రైనేజీలను క్లీన్‌ చేయించారు. ఖాళీస్థలాలను పరిశీలించి, చెత్తను తొలగించేలా సూచనలిచ్చారు. మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు., పార్కులు, శ్మశానవాటికల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని కమిషనర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు ఆరు రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. పరిశుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజీవ్‌నగర్‌కాలనీ, కారల్‌మార్క్స్‌కాలనీ, యాదవకాలనీ, కృష్ణకాలనీ, జవహార్‌నగర్‌ కాలనీల్లో పట్టణ ప్ర గతి కార్యక్రమాల్లో కౌన్సిలర్లు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ స భ్యులు చేసిన పనులతో పలు వార్డులు కళకళలాడాయి. 


కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

11మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెల్లో గతంలో చేపట్టిన పనులను పరిశీలిస్తూ అప్పటి ప్రణాళికలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతు న్నారు. ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వైకుంఠధామాలు, నర్సరీల ఏర్పాటు పనులు కొనసాగిస్తు న్నారు. రహదారులను శుభ్రం చేస్తున్నారు. సైడ్‌ డ్రైన్లను క్లీన్‌ చేయిస్తున్నారు. కలెక్టర్‌ అజీమ్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కాటారం, గంగారంలో ఆకస్మికంగా పర్యటించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, వాటి నాణ్యతా అంశాలను పరిశీలించారు. 


బిజీబిజీగా అధికారులు

పల్లె, పట్టణ ప్రగతితో కార్యక్రమాలతో జిల్లాలోని అధికారు లు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి అగ్రభాగాన ఉండడంతో అధికార యంత్రాం గం వీటిపై దృష్టిసారించింది. దీంతో వార్డు స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అధికారులు బిజీ అయ్యారు.


ప్రగతిపథంలో నడిపించాలికలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ కాటారం, గంగారంలో సుడిగాలి పర్యటన

కాటారం, ఫిబ్రవరి 29: పల్లెలను ప్రగతిపథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ కోరారు. కాటారం మండలంలో కలెక్టర్‌ శనివారం ఆకస్మింగా పర్యటించారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లను పరిశీలించారు. ప్రజా సమస్య లు తెలుసుకున్నారు. పారిశుధ్య పనులు చూసి, అధికారులు, పాలకవర్గం సభ్యులు, ప్రజలతో మాట్లాడారు. పచ్చదనం పెంచాలని సర్పంచ్‌ దేవేందర్‌రెడ్డి, కార్యదర్శి సరస్వతిని ఆదేశించారు. రహదారి పక్కన పాడుబడిన బావిని పరిశీలించి, బావిని వినియోగంలోకి తేవాలన్నారు. బండారికుంటను చూ సి మినీ ట్యాంక్‌బండ్‌లా తీర్చిదిద్దాలని ఐబీ ఈఈని ఆదేశించారు. కుంట కట్టపై సీసీ రోడ్డు పోయాలని పీఆర్‌ ఈఈకి సూచించారు. జెడ్పీహెచ్‌ఎస్‌ను తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో కిచెన్‌షెడ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ బాలికల భవనాన్ని పూర్తి చేయాలని సూచించారు. 


అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. మోడల్‌ స్కూల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య ఉండగా, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వెల్‌నెస్‌ సెంటర్‌ను తనిఖీ చేసి వైద్య సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు 100 కుటుంబాలకు పైగా కూరగాయల సాగు చేస్తారని తెలియడంతో స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో కో-ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. కాటారం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. వెంట డీఎంహెచ్‌వో డాక్టర్‌ గోపాల్‌రావు, ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ తెప్పల దేవేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ సమ్మయ్య, వైద్యాధికారి ప్రమోద్‌, కార్యదర్శులు షగీర్‌ఖాన్‌, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>