గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 29, 2020 , 02:17:35

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఐదో రోజు పట్టణ ప్రగతి జోరుగా సాగిం ది. అటు పల్లెల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రజాదరణ మధ్య ఉత్సాహంగా కొనసాగాయి. భూపాలపల్లి పట్టణంలోని అన్ని వార్డుల్లో శుక్రవారం పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, స్పెషలాఫీసర్ల ఆధ్వర్యంలో చెత్తా చెదారాన్ని తొలగించారు. మురుగుకాల్వలు శుభ్రం చేశారు. ఖాళీ స్థలాలను గుర్తించారు. ప్రైవేటు స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, కాసింపల్లి, సుభాశ్‌కాలనీ, గాంధీనగర్‌, కారల్‌మార్క్స్‌ కాలనీ, సీఆర్‌ నగర్‌, హనుమాన్‌ నగర్‌తో పాటు పలు వార్డుల్లో కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ పర్యటించారు. ఎక్కడికక్కడ సలహాలు, సూచనలిచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబులు వెంట రాగా ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు, వార్డు కమిటీల సభ్యుల సమక్షంలో పరిశుభ్రత, పచ్చదనం, తదితర అంశాలపై కలెక్టర్‌ ప్రజలతో మమేకమై చ ర్చించారు. అవసరమైన మంజూరీలను ఇవ్వాలని కలెక్టర్‌ ము న్సిపల్‌ అధికారులను ఆదేశించారు. 


వార్డుల్లో సమస్యలను ప్ర జలు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎక్కడికక్కడ పరిష్కారానికి మార్గాలు చూపించారు. అవసరమైన యం త్ర సామగ్రిని కొనుగోలు చేయడం, పారిశుధ్య సిబ్బందిని నియమించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రగతిలో సత్ఫలితాలు సాధించి అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయా వార్డుల ప్రజలను, అభివృద్ధి కమిటీ సభ్యులను కోరారు. శ్మశాన వాటికల ఏర్పాటు, పార్కుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పా రు. నర్సరీలు ఏర్పాటు చేసి పబ్లిక్‌ పార్కులు, సులభ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ చెప్పారు. దానికి సంబంధించి అవసరమైన స్థలాలు గుర్తించాలని, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించి, కౌన్సిలర్లకు సూచనలిచ్చారు. 


డ్రోన్‌ ద్వారా పనుల పరిశీలన

భూపాలపల్లి పట్టణం శరవేగంగా విస్తరిస్తుందని, దానికి అ నుగుణంగా మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్రోన్‌ కెమెరా ద్వారా పట్టణాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రత అంశాలను గుర్తించి ఆ ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో ప్రత్యేక నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


జోరుగా పల్లె ప్రగతి

పల్లె ప్రగతి కార్యక్రమాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పదకొండు మండలాల పరిధిలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగాయి. వీటిని పరిశీలించేందుకు కలెక్టర్‌ సుడిగాలి పర్యటన నిర్వహించారు. జిల్లాలోని రేగొండ, గణపురం, భూపాలపల్లి మండలాల్లో కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఆకస్మికంగా పర్యటించారు. ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. గణపురం మండలంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని, నర్సరీని, శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. మోరంచపల్లిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పౌష్టికాహారం, హాజరు పట్టికను చూశారు. నమోదైన చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. రేగొండ మండల కేంద్రంలో నర్సరీతో పాటు శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. కార్యదర్శి, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.


సందడే సందడి..

జిల్లాలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం జోరుగా సాగాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో, జిల్లాలోని గ్రామాల్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలలో వార్డు కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కో ఆప్షన్‌ సభ్యులు, వార్డు సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చెత్త తొలగింపు, స్థానికులకు సలహాలు, సూచనలిస్తూ ముందుకు సాగారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా పనుల్లో పాలుపంచుకోవడంతో భూపాలపల్లితో పాటు జిల్లాలో సందడి నెలకొంది.logo
>>>>>>