గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 29, 2020 , 02:16:28

పట్టణ పరిశుభ్రతే లక్ష్యం

పట్టణ పరిశుభ్రతే లక్ష్యం

కృష్ణకాలనీ, ఫిబ్రవరి 28 : భూపాలపల్లి పట్టణంలో పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చే యాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ కోరారు. 8, 27, 30వ వార్డుల్లోని జవహర్‌నగర్‌ కాలనీ, సత్తార్‌నగర్‌లో ఆయన శుక్రవారం పర్యటించా రు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జవహర్‌నగర్‌ బొబ్బలోని చెరువును సందర్శించారు. డ్రైనేజీలో నీరు ప్రవహించే కాలువను చూశారు. డ్రైనేజీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన వాటిక, పిల్లలకు ఆట స్థలం, కాలనీలోని పోశమ్మ గుడికి ప్రహరీ, తాగునీటి సౌ కర్యం కల్పించాలని స్థానికులు కోరారు. కలెక్టర్‌ స్పందించి 371 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ స్థలంలో  ఆట స్థలం ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. 171, 324 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూముల్లో శ్మశాన వాటికను నిర్మించేందుకు సర్వే నిర్వహించాలని ఆర్డీవో వైవీ గణేశ్‌ను ఆదేశించా రు. పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇ చ్చారు. డ్రైనేజీ ఎత్తు పెంచాలని, పోశమ్మ గుడి నుంచి బీటీ రోడ్డు నిర్మించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. 27వ వార్డులో ఐదు పబ్లిక్‌ టాయిలెట్స్‌, ఆరు కరెంటు స్తంభాలు కావాలని కౌన్సిలర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి కోరడంతో సాను కూలంగా స్పందించి పనులు చేస్తామన్నారు. ఇనుప, విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి వేయా లని విద్యుత్‌ ఎస్‌ఈ నరేశ్‌ను ఆదేశించారు. అన్ని వార్డులకు త్వరలో మిషన్‌ భగీరథ తాగునీటిని అందిస్తామన్నారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపు లా మొక్కలు నాటాలని సూచించారు. కాలనీల్లో పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయించాలని మున్సిపల్‌ అధికారులను కోరారు. డ్రైనేజీల్లోని మురుగునీటిని బయటకు పంపాలని, పాఠశాల లు, కళాశాలలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలను నాటాలన్నారు. 


రెండు రో జుల్లో పట్టణంలో ఉన్న పందులను ఇతర ప్రాం తాలకు తరలించాలని, పందుల పెంపకందారులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుక్కలు, కోతుల బెడద లేకుండా చర్యలు  చేపడ తామన్నారు. ప్రజలు పట్టణ ప్రగతిలో స్వచ్ఛందంగా పాల్గొని తమ ఇండ్లను శుభ్రంగా ఉంచుకో వాలని, తడి, పొడి చెత్తను కుండిలలో వేయాలన్నారు. కృష్ణకాలనీ శివారులో ఫీకల్‌ స్లెడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటుతో కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చని తెలిపారు. కాగా, జవహర్‌నగర్‌లో పట్టణ ప్రగతిలో పాల్గొన్న కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దు ల్‌ అజీమ్‌ కుంచాల వెంకటేశ్వర్లు-ఆదిలక్ష్మీ కూతు రు ఉమను ఎత్తుకొని అప్యాయంగా లాలించారు. వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెం కటరాణి సిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ము న్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, 8వ వార్డు కౌన్సిలర్‌ నూనె రాజు, 27వ వార్డు కౌన్సిలర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్‌ కమల, 26వ వార్డు కౌన్సిలర్‌ నిహారికా శ్రీనివాస్‌, 6వ వార్డు కౌన్సిలర్‌ ఎడ్ల మౌనికా శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తిరుపతి, కరీం, మేనం రాజేందర్‌, పైడిపల్లి రమేశ్‌, బీబీ చారి, ప్రత్యేకాధికారులు గిరిధర్‌, శ్రీకాంత్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo