గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 25, 2020 , 03:00:03

పల్లెల్లో జల సవ్వడి

పల్లెల్లో  జల సవ్వడి

రేగొండ, ఫిబ్రవరి 24 : పల్లెల్లో శ్రీరాంసాగర్‌ జలాలు సవ్వడి చేస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  ఎసారెస్పీ డీబీఎం 38 కాల్వల ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన గోదావరి జలాలు చివరి ఆయకట్టు వరకు అందుతున్నాయా..? లేదా అనే విషయంపై  సోమవారం ఎమ్మెల్యే గండ్ర, ఎస్సారెస్పీ ఆధికారులు కాల్వల వెంట తిరిగారు.  రేగొండ మండలం కొన్నరావుపేట శివారు కొత్తపల్లి నుంచి మొదలు..  టేకుమట్ల మండలం టేలేండు వరకు కాల్వలను పరిశీలించారు. సాగునీరుతో పాటు డీబీఎం 38 మరమ్మతులను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడ ఎక్కడ తూములు అవసరం ఉన్నది.. ఏ ప్రాంతానికి సాగునీరు అందడం లేదనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రం నుంచి చిట్యాల , టేకుమట్ల మండలంలోని టేలేండు వరకు జరుగుతున్న ఎస్సారెస్పీ ప్రధాన, ఉప కాల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం విడుదల చేసిన నీరు ఏప్రిల్‌ 23వ తేదీ వరకు నిరంతరంగా వస్తుందన్నారు. ఈ నీటితో ఇప్పటికే నియోజకవర్గంలోని 56 చెరువులు నిండాయన్నారు. 


పంటపొలాలకు ఏడాది పొడవునా గోదావరి జలాలు  అందిస్తామన్నారు. ఈ నీటితో పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు.   రూ.59 కోట్లతో డీబీఎం 38 కాల్వల  మరమ్మతులు  చేస్తున్నామన్నారు.   కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యవసాయాన్ని  పండుగ చేయడానికి గాను ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగునీటి వనరులకు మరమ్మతులు చేస్తున్నామన్నారు.  ఈ ప్రాంతంలో కాల్వలు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని, వాటి పరిధిలోని 83 వేల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా  నిరంతరంగా సాగు నీరు అందించడానికి గాను  మరమ్మతులు చేస్తున్నామన్నారు.  ఎస్పారెస్పీ కాల్వల మరమ్మతుల వల్ల ఏడాది పొడవునా గోదావరి జలాలు పరుగులు తీస్తాయన్నారు. దీంతో ఈ ప్రాంతంలో రెండు పంటలకు సాగునీరు నిరంతరంగా అందుతుందన్నారు.  ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణాలకు  శ్రీకారం చూట్టారన్నారు. 31 సంవత్సరాల క్రితం నిర్మించిన కాల్వలోఎప్పుడూ చుక్క నీరు రాలేదని, వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. 


పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అని రంగాల్లో  అభివృద్ధి చేయాలనే  లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.  దీంతో అతి త్వరలోనే తెలంగాణ దేశంలోనే సంపన రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. కాగా,ఎమ్మెల్యే పర్యటనతో ఎస్సారెస్పీ ఆధికారులకు చెమటలు పట్టాయి. పనులు నాణ్యతతో జరగడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది రైతులు కల్వను ఆక్రమించుకున్నారని,  దీనిపై అధికారులు ఏం చేస్తున్నారు మండిపడ్డారు. అదే విధంగా కాంట్రాక్టర్‌ నాణ్యత లేకుండా పనులు చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని    కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి డీఈ వీరస్వామి, మేరి, నిర్మల సాల్మన్‌రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌ గౌడ్‌, జెడ్పీటీసీ సాయిని విజయముత్యంరావు, చైర్మన్లు  ఇంగే మహేందర్‌, నడిపల్లి విజ్ఞాన్‌రావు, సర్పంచ్‌ లింగంపల్లి స్వేత, కుసుంభ రంజిత్‌, నడిపల్లి శ్రీనివాసరావు, నాయకులు పున్నం రవి, కేసిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సామ్రాట్‌ రవి, మటిక సంతోష్‌, మైస భిక్షపతి, బండి కిరణ్‌గౌడ్‌, నారాయణరెడ్డి, గంజి రజినీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.


logo