గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 24, 2020 , 02:57:07

ఓరుగల్లు చైతన్యం గొప్పది

ఓరుగల్లు చైతన్యం గొప్పది

మట్టెవాడ, ఫిబ్రవరి 23: వరంగల్‌ ఏవీవీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పలువురు ప్రధాన వక్తలు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాటినం జూబ్లీ భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం పూ ర్వ ఉపకులపతి ఎన్‌ లింగమూర్తి మాట్లాడు తూ.. విలువలతో కూడిన విద్యనందించడం విద్యా సంస్థలు బాధ్యతగా స్వీకరించి సులభమైన మార్గంలో విద్యాబోధన చేయాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ మోహన్‌కందా, మరో ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యా రంగంలో సమూల మా ర్పులు అవసరమని, వృత్తికి సంబంధం ఉన్న కో ర్సులను ప్రవేశపెట్టి ఉపాధి కల్పించే మార్గాన్ని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. ఎర్రప్రగడ సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. విశ్వద్యాలయాల్లోనూ మార్పు లు అవసరమని పోటీ రంగానికి తగ్గట్టుగా మార్పులు చేసి భవిష్యత్‌ తరాలకు ఉన్నతమైన విద్యను అందించాలన్నారు. పాలకుర్తి రామ్మూర్తి మాట్లాడుతూ.. మానవీయ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే అందించాలని సూచించారు. 


అ నంతరం అలుమిని అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అధ్యక్షతన అలుమిని సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు బీవీ పాపారావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్యకు ఏవీవీ నిలువెత్తు నిదర్శనమని, నిజాం కాలంలో తెలుగు మీడియంలో విద్యనందించేలా చందా కాంతయ్య చేసిన సేవలు అభినందనీయమన్నారు. తాను ఈ పాఠశాల విద్యార్థిగా విద్యతో పాటు క్రమశిక్షణ, వినయం, విధేయత నేర్చుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మైదానంలో ఆడుకున్న ఆటలను, తోటి మిత్రులను గుర్తు చేసుకొని సంబురపడ్డారు. తమ తోటి మిత్రులతో కలిసి ఏవీవీకి  సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేం ద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆర్థికపరమైన విషయాలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఉండాలన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాటుపడాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌వీఎన్‌ శర్మ, టీ నారాయణరావు, రామాశ్రీనివాస్‌, జీ రవికుమార్‌, గుమ్మడవెల్లి సత్యనారాయణ, గాదె వాసుదేవ్‌  పాల్గొన్నారు. అందరికీ అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ

మట్టెవాడ:ఏవీవీ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రతి ఒక్కరికీ అభివాదం చేశారు. సమావేశం అనంతరం వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ ముందుకొచ్చిన కరచాలనం చేసి పలకరించారు. ముఖ్య నాయకులు ముందువరుసలో ఉండడంతో గ్యాలరీలోని చివరి వరకు వెళ్లి తిరిగి వచ్చి అందరికీ అభివాదం చేస్తూ.. పలకరించారు. 


ఆ పాత తీపి గుర్తులు  

మట్టెవాడ, ఫిబ్రవరి 23: ఆ పాత తీపి గుర్తులను మరోసారి మననం చేసుకున్నారు ఏవీవీ విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు.  1969 బ్యాచ్‌ విద్యార్థి అయిన మాజీ ఐఏఎస్‌ అధికారి బీవీ పాపారావు  వేడుకలకు హాజరుకాగా.. తన మిత్రులను కలిసి సరదాగా కాలేజీ ముందున్న చాయ్‌ కొట్టు వద్ద చాయ్‌ తాగు తూ.. ముచ్చట్లు పెడుతూ సరదాగా గడిపారు. 
logo
>>>>>>