మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 24, 2020 , 02:55:19

నేటి నుంచి పట్టణ ప్రగతి

నేటి నుంచి పట్టణ ప్రగతి

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 23 : ప్రభుత్వం పల్లె ప్రగతి స్ఫూర్తితో ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నేటి నుంచి కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ప్రారంభం కానుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నేడు (సోమవారం) పట్టణంలోని సీఆర్‌నగర్‌ (3వ వార్డు)లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఆర్‌నగర్‌తోపాటు బాంబులగడ్డ, రాజీవ్‌నగర్‌, కారల్‌మార్క్స్‌ కాలనీ, 6ఇైంక్లెన్‌ బ్యారెక్స్‌ (4వ వార్డు), రాజీవ్‌నగర్‌, కారల్‌మార్క్స్‌ కాలనీ (23వ వార్డు)లలో ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వార్డుల వారీగా షెడ్యూల్‌ను జిల్లా అదనపు కలెక్టర్‌ రాజా విక్రంరెడ్డి ఖరారు చేశారు. 


షెడ్యూల్‌ ఇదే..

24న 3, 4, 23వ వార్డుల్లోని సీఆర్‌నగర్‌తోపాటు రాజీవ్‌నగర్‌, కారల్‌మార్క్స్‌కాలనీ, 6ఇైంక్లెన్‌ బ్యారెక్స్‌, 25న 9వ వార్డులోని పిల్లోనిపల్లి, మహబూబ్‌పల్లి, కుందూరుపల్లి, బీసీకాలనీ, మంజూర్‌నగర్‌, సింగరేణి ఏరియా హాస్పిటల్‌, క్వార్టర్స్‌, నర్సింహరెడ్డిపల్లి, 10వ వార్డులోని గండ్రపల్లి, పుల్లూరు రామయ్యపల్లి, లచ్చిరాంతండా, బంగ్లాస్‌ ఏరియా, మంజూర్‌నగర్‌ మెయిన్‌రోడ్‌, 11వ వార్డులోని వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, భాస్కర్‌గడ్డ, 26న 6వ వార్డులోని కృష్ణకాలనీ, 7వ వార్డులోని సింగరేణి టీ2 క్వార్టర్స్‌, 26వ వార్డులోని సింగరేణి హెడ్‌ క్వార్టర్స్‌, 27న 24వ వార్డులోని కారల్‌మార్క్స్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌, సీ2, ఎంసీ, పోలీసు క్వార్టర్స్‌, 25వ వార్డులోని కారల్‌మార్క్స్‌ కాలనీ, 5వ వార్డులోని యాదవకాలనీ, 28న 8వ వార్డులోని జవహర్‌నగర్‌ కాలనీ, 27వ వార్డులోని రెవెన్యూ కాలనీ, హైటెక్‌ కాలనీ, సత్తార్‌నగర్‌, పైలెట్‌ కాలనీ, జవహర్‌నగర్‌ కాలనీ, 30వ వార్డులోని రెడ్డి కాలనీ, సత్తార్‌ కాలనీ, 29న 20వ వార్డులోని శాంతినగర్‌, 21వ వార్డులోని శాంతినగర్‌, హనుమాన్‌ నగర్‌, 22వ వార్డులోని హనుమాన్‌నగర్‌, లక్ష్మీనగర్‌, మార్చి 1న 1వ వార్డులోని సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి, 12వ వార్డులోని కాసింపల్లి, హనుమాన్‌ టెంపుల్‌, చల్లూరిపల్లి, ఎడ్లవాడ, సుంకరివాడ, మేకలవాడ, బానోతువాడ, 13వ వార్డులోని కాసింపల్లి, బాలాజీనగర్‌, బెడ్డలపల్లి, జోరువాడ, ఎస్సీ కాలనీ, మేకలవాడ, హనుమాన్‌ టెంపుల్‌ లైన్‌, 2న 2వ వార్డులోని ఆకుదారివాడ, పక్కీరుగడ్డ, 14వ వార్డులోని జంగేడు, సెగ్గంపల్లి, 15వ వార్డులోని మిలీనియం క్వార్టర్స్‌, 2 ఇైంక్లెన్‌ బ్యారెక్స్‌, కాకతీయ కాలనీ, ఇందిరానగర్‌, జంగేడు, శ్యామగడ్డ, 3న 17వ వార్డులోని సుభాష్‌ కాలనీ, 28వ వార్డులోని ఎండీ క్వార్టర్స్‌, 29వ వార్డులోని న్యూ సుభాష్‌ కాలనీ, 4న 16వ వార్డులోని సుభాష్‌ కాలనీ, రాంనగర్‌, 18వ వార్డులోని గాంధీనగర్‌, ఎల్బీ నగర్‌, 19వ వార్డులోని రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్‌, బానోతువాడలలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగనుంది. 


logo
>>>>>>