గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 24, 2020 , 02:51:10

రామప్పలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

రామప్పలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

వెంకటాపూర్‌, ఫిబ్రవరి 23 : మహాశివరాత్రిని పురస్కరించుకుని రామప్పలో మూడు రోజులపాటు అంగరంగ వైభవం గా నిర్వహించిన ఉత్సవాలు ఆదివారం  అగ్నిగుండాలతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులు భారీ ఎత్తు న తరలివచ్చి రామలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ శిల్పసంపదను చూసి మం త్రముగ్ధులయ్యారు. ఉత్సవాల సందర్భం గా అధికారులు దేవాలయంలో ప్రత్యేక ఏ ర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలతో ఆలయంలో కొత్త శోభ సంతరించుకుంది. కాగా, రామలింగేశ్వరు డు మూడు రోజుల పాటు భక్తులకు వి విధ రూపాల్లో దర్శనమిచ్చాడు. కొమురవెల్లికి చెందిన మోహనమఠంకు చెందిన ఆంద య్య, హనుమకొండ సిద్ధాంతిమఠానికి చెందిన గణేశ్‌, హనుమకొండకు చెంది న విక్రయ్‌, ఆలయ పూజారులు కోమళ్లపల్లి హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌ల ఆధ్వర్యంలో స్వామివారికి నిత్య పూజలు, అర్చనలు చే సి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. 


logo