మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 22, 2020 , 03:05:19

రైతుల ఇంట సిరుల పంట

రైతుల ఇంట సిరుల పంట


టేకుమట్ల, ఫిబ్రవరి 21: తెలంగాణలోని ప్రతి రైతు ఇంటా సిరులు పండాలని, అదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. వెంటకట్రావ్‌పల్లిలో రూ. 6.7 కోట్లతో నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ శుక్రవారం ప్రారంభించారు. వెలిశాలలో రూ. 7.5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, సుబ్బక్కపల్లిలో రూ. 2 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. వెంకట్రావ్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు పండించడానికి కావాల్సిన సాగునీరు, విద్యుత్‌, ఎరువులను అందించడంలో కేసీఆర్‌ కృషి మరవలేనిదని చెప్పారు. పెట్టుబడికి రైతులు ఇబ్బంది పడకుండా రైతుబందు అందిస్తున్నారని, సకాలంలో విత్తనాలు, ఎరువులు తెప్పిస్తున్నారని గుర్తుచేశారు. పంటలపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల ఖాళీలను భర్తీ చేశారని తెలిపారు. 


ఇప్పటికే నియోజక వర్గానికి 8 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయని, అందులో ఒకటి వెలిశాలలో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా, టేకుమట్ల మండలం మధ్య ఉన్న మానేరు వాగుపై మరో చెక్‌ డ్యాం కట్టించి, టేకుమట్ల మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఈ విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని స్పష్టం చేశారు. శంకుస్థాపనలు చేసిన పనులను త్వరగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధనంతో పనులు చేస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని వారిని హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యం చూపితే కాంట్రాక్టర్ల లైసెన్స్‌ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ ఐలయ్య, చిట్యాల పీఎసీఎస్‌ చైర్మన్‌ కుంభం క్రాంతి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు కత్తి సంపత్‌గౌడ్‌, తిరుపతి, సర్పంచులు పొలాల సరోత్తంరెడ్డి, పండుగ శ్రీను, మహేశ్‌, శ్రీను, విజయ, నాయకులు ఆది రఘు, గందం సారయ్య, నందికొండ మహిపాల్‌రెడ్డి, బందెల నరేశ్‌, కోటి,  నానవేని కుమార్‌, శంకర్‌, స్వామిరావు, కూర రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


బూర్నపల్లిలో ప్రత్యేక పూజలు 

టేకుమట్ల, ఫిబ్రవరి 21: బూర్నపల్లి గుట్టపై వెలిసిన గట్టు మల్లన్నను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గతంలో గుట్టపై రోడ్డు లేదని తన దృష్టికి తీసుకురాగా రోడ్డు వేయించామని, విద్యుత్‌ స్తంభాలు వేయించి లైటింగ్‌ పెట్టించామని, గుట్టపై చదును చేయించి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. మల్లన్న కృపతో గుట్టపై గుడి కట్టేందుకు కృషి చేస్తానన్నారు. వెంట పలువురు పాల్గొన్నారు. 


logo
>>>>>>