శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 22, 2020 , 03:03:24

సరస్వతీ బరాజ్‌కు గోదావరి జలాల పంపింగ్‌

సరస్వతీ బరాజ్‌కు గోదావరి జలాల పంపింగ్‌

కాళేశ్వరం, ఫిబ్రవరి 21 : జిల్లాలో ఉన్న లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌజ్‌లో శుక్రవారం 11  మోటర్ల  ద్వారా 2 టీఎంసీల నీటిని తరలించారు. మహాశివరాత్రి  సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తుల సౌకర్యార్థం పంప్‌హౌజ్‌లో మూడు రోజుల నుంచి మోటర్లను ఆఫ్‌ చేశారు. కాగా, శుక్రవారం మోటర్లు ఆన్‌ చేసి సరస్వతీ(అన్నారం) బరాజ్‌ నీటిని తరలించారు. 11 మోటర్ల నుంచి వస్తున్న నీరు గ్రావిటీ కెనాల్‌ డెలవరీ సిస్టర్న్‌ వద్ద ఉన్న 22 పైపుల నుంచి కిందకు దుముకుతూ అన్నారం (సరస్వతి)బరాజ్‌కు తరలుతున్నాయి.


logo