గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 22, 2020 , 02:57:53

రామప్పకు యునెస్కో గుర్తింపు తథ్యం

రామప్పకు యునెస్కో గుర్తింపు తథ్యం

వెంకటాపూర్‌, ఫిబ్రవరి 21 : కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత శిల్పకళకు నెలవైన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తథ్యమని మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ములుగు జిల్లాకు ప్రత్యేకమైన స్థానముందన్నారు. జిల్లా పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరన్నారు. రామప్పలో ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వచ్చే శివరాత్రి వరకు సీఎం కేసీఆర్‌ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయిస్తామన్నారు. గతంలో ఎంపీ ల్యాడ్స్‌ కింద రూ. 13లక్షలు కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నాయని, వాటితో రామప్పలో పార్కు ఏర్పాటుతోపాటు కేవీ స్కూల్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తానన్నారు.


రామప్పకు వచ్చి భక్తులు రామలింగేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రజితాసమ్మయ్యగౌడ్‌, రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రాంమోహన్‌రావు, మేడారం డైరెక్టర్‌ చంటి భద్రయ్య, నాయకుడు మూల రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>