సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Feb 21, 2020 , 02:58:42

డీసీసీబీ పాలకవర్గ ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

డీసీసీబీ పాలకవర్గ ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎలక్షన్‌ అథారిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల అధికారి 22వ తేదీన డీసీసీబీ పాలకవర్గం ఎన్నికకు నోటీస్‌ జారీ చేస్తారు. 25వ తేదీన ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు.

  • నోటిఫికేషన్‌ జారీ చేసిన స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ
  • 25న నామినేషన్లు, ఉపసంహరణ
  • 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌
  • 29న ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక

సుబేదారి, ఫిబ్రవరి 20 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎలక్షన్‌ అథారిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల అధికారి 22వ తేదీన డీసీసీబీ పాలకవర్గం ఎన్నికకు నోటీస్‌ జారీ చేస్తారు. 25వ తేదీన ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3గంటల వరకు స్క్రూటినీ, సాయంత్రం 3:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉపసంహరణ. 28వ తేదీన ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదేరోజు కౌంటింగ్‌, సాయంత్రం ఫలితాల వెల్లడి, 29న ఆఫీస్‌బేరర్స్‌ ఎన్నిక ఉంటుంది.  


ఓటర్లు వీరే ..

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గం ఎన్నికలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 90మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, 22వ్యవయయేతర సంఘాల  చైర్మన్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరందరిలో  పీఏసీఎస్‌ల నుంచి 16మందిని, 22 వ్యవయేతర సంఘాల చైర్మన్ల నుంచి నలుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. ఈ 20మందిలో ఒకరిని డీసీసీబీ చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుంటారు. డీసీసీబీ పాలకవర్గ ఎన్నికల అధికారిగా జనగాం జిల్లా సహకార శాఖ అధికారి నియామకమయ్యారు.


ఓడీసీఎంఎస్‌ ఎన్నికలు..

డీసీసీబీ పాలకవర్గం ఎన్నికతోపాటు ఓరుగల్లు జిల్లా కోఆపరేటివ్‌ మార్కెట్‌ సొసైటీ ఎన్నిక ఒకేరోజు 28వ తేదీన నిర్వహించాలని స్టేట్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలో 90మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయేతర సంఘాల చైర్మన్లు ఓటు హక్కుకలిగి ఉంటారు. వీరిలో ఒకరిని చైర్మన్‌, మరొకరి వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 


logo