సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 20, 2020 , 03:11:09

సహకార సంఘాలతో రైతుల అభివృద్ధి

సహకార సంఘాలతో రైతుల అభివృద్ధి


చిట్యాల/రేగొండ, ఫిబ్రవరి 19 : సహకార సం ఘాలు రైతుల ఐక్యత, అభివృద్ధికి దోహదపడతాయ ని, సమష్టి కృషి ఉంటే రైతులతో పాటు సంఘం అభివృద్ధి చెందుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. చిట్యాల, రేగొండలో బుధవాం వేర్వేరుగా నిర్వహించిన పీఏసీఎస్‌ పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. చిట్యాల సర్పంచ్‌ మాసు రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పంట రుణాలతో పాటు, పంట సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు తక్కువ ధరతో సకాలంలో రైతులకు అందించాలని కోరారు. రైతుసమన్వయ సమితి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయశాఖ, ఫిషరీస్‌, విద్యుత్‌శాఖ సేవలను రైతులు వినియోగించుకోవాలని సూచించా రు. 


టేకుమట్ల, చిట్యాల మండలాలకు ఎస్సారెస్పీ కా ల్వ ద్వారా సాగునీరు ఇస్తానని హామీఇచ్చారు. చిట్యాల కేంద్రంగా వ్యవసాయ సహకార బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు ఎంపీ దయాకర్‌తో మాట్లాడామన్నారు. నూతన పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంభం క్రాంతి కుమార్‌ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఒడితల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, టేకుమట్ల మం డల గట్టుమల్లు జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంపీపీలు దావు వినోదావీరారెడ్డి, మల్లారెడ్డి, టేకుమట్ల జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, డైరెక్టర్లు, ఎంపీటీసీ కట్కూరి నరేందర్‌, నాయకులు కుంభం రవీందర్‌రెడ్డి, చింతల రమేశ్‌, పాండ్రాల స్వామి, పెరుమాండ్ల రవీందర్‌గౌడ్‌ తదితరులు  పాల్గొన్నారు.


రేగొండలో పలు కార్యక్రమాలకు.. 

రేగొండ పీఏసీఎస్‌ చైర్మన్‌ నడిపెల్లి విజ్జన్‌రావు, వైస్‌ చైర్మన్‌ సామాల పాపిరెడ్డి, డైరెక్టర్లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గాన్ని సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో సహకార సంఘాలు మరింత బలోపేతం అవుతాయని, వీటి ద్వారా రైతులకు అనేక సేవలు అందించాలని కోరారు. రైతుల అభివృద్ధే సీఎం లక్ష్యమన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీస్‌ఎస్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కలెక్టర్‌ ఫండ్‌ నుంచి 35 సైకిళ్లు మంజూరు కాగా, ఆ సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. 


ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో విద్య బోధిస్తున్నా మని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. అలాగే పెద్దంపల్లి శ్మశాన వాటిక, రేపాకలోని చలివాగు బ్రిడ్జిపై3.5 కోట్లతో నిర్మింస్తున్న లిప్టు ఇరిగేషన్‌ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ విజ య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌ గౌడ్‌, ఆలయ చైర్మన్‌ హింగె మహేందర్‌, సర్పంచ్‌ ఏ డునూతుల నిషిధర్‌రెడ్డి, ముత్యంరావు, రవి, రాజేశ్వర్‌రావు, శ్రీనివాసరావు, మధుసూదన్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, శ్రీధర్‌, భిక్షపతి, ప్రతాప్‌రెడ్డి, రజినీకాంత్‌, నర్సింగారావు, రంజిత్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.


logo