గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 20, 2020 , 03:08:34

కాళేశ్వరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

కాళేశ్వరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి


కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. లక్షలాది మంది హాజరయ్యే కాళేశ్వరం శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండాగోదావరి నదిలో జాలీలు ఏర్పాటు చేయాలని, వీఐపీ ఘాట్‌, ఇతర ప్రాంతాల్లో గజఈతగాళ్లు, లైఫ్‌ జాకెట్లు అందు బాటులో ఉండేలా చూడాలన్నారు. అపరిశుభ్ర వాతావరణం ఏర్పడ కుండా పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. భక్తుల రద్దీకి సరిపడా మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు ఉండాలని, అన్ని ప్రాంతాలలో తాగునీరు ఏర్పాటు చేయాలని, జాతర సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. 


అవసరమైన ప్రాం తాల్లో అదనంగా విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేయాలని, జాతరలో అక్రమ మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసి నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని, అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌, హన్మకొండ, భూపాలపల్లి, మంథని, గోదావరిఖని, మంచిర్యాల ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని అంకిస, ఆసరెల్లి, ప్రాంతం నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపాలని ఆయన ఆదేశించారు. జాతర జరిగే మూడు రోజుల పాటు ఇసుక లారీలు నడపకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, ఈఈఆర్‌డబ్ల్యూఎస్‌ నిర్మల, జిల్లా వైద్యా అధికారి డాక్టర్‌ గోపాల్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్‌, డీపీఆర్‌వో రవికుమార్‌, ఆర్టీసీ డీఎం లక్ష్మీధర్మ, పంచాయతీ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


logo