శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 20, 2020 , 03:04:49

ఎనిమిదో రోజు రూ.59.22 లక్షలు

ఎనిమిదో రోజు రూ.59.22 లక్షలు


వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 19: మేడారం మహాజాతరలో అమ్మవార్లకు భక్తులు చెల్లించుకున్న కానుకల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. బుధవారానికి లెక్కింపు ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. దాదాపు 200 మంది సిబ్బంది ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపులో పాల్గొంటున్నారు. జాతరలో ఏర్పాటు చేసిన మొత్తం 494 హుండీల్లో 492 హుండీల లెక్కింపు పూర్తయ్యింది. బుధవారం 56 హుండీలను లెక్కించగా రూ. 59,22,000 ఆదాయం సమకూరినట్లు మేడారం ఆలయ ఈ వో తమ్మ రాజేంద్రం వెల్లడించారు. ఇప్పటివరకు లెక్కించిన హుండీల్లో కానుకలు మాత్రమే లెక్కించామని, హుండీల్లోని బియ్యంలో మరిన్ని కానుకలు లభించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. గురువారం మొత్తం హుండీలను లెక్కిస్తామన్నారు. వెండీ, బంగారం ఆభరణాలను గురు, శుక్రవారాల్లో ప్రత్యేక అధికారి సమక్షంలో తూకం వేసి లెక్కిస్తామన్నారు. ఇప్పటివరకు లెక్కించిన హుండీల్లో రూ. 10,89,14,912 ఆదాయం లభించిందని రాజేంద్రం వివరించారు. గత మేడారం జాతరతోపోలిస్తే ఈసారి మరింత ఆదాయం పెరుగుతుందని ఆయన తెలిపారు.


logo