మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 19, 2020 , 03:56:54

పట్టణాలు మెరవాలె

పట్టణాలు మెరవాలె

పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.

  • పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి
  • అభివృద్ధికి పక్కా ప్రణాళికలుండాలి
  • ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగండి
  • మున్సిపల్‌ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ ఉద్బోధ
  • భూపాలపల్లి నుంచి హాజరైన ఎమ్మెల్యే గండ్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో  రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సమ్మేళనం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉన్నదన్నారు. బాధ్యతగా పనిచేసి ప్రజల మెప్పు పొందాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, కార్యదీక్షతో పనిచేయాలని హితబోధ చేశారు. సంకల్పం గట్టిగా ఉంటే విజయం వరిస్తుందన్నారు. ఆరు నెలలు కష్టపడితే పట్టణాల రూపురేఖలు మారుతాయన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, కమిషనర్‌ సమ్మయ్య పాల్గొన్నారు. 

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 18 : ‘పట్టణాలు అద్దంలా మెరవాలె.. అభివృద్ధికి పక్కా ప్లాన్లు త యారు చేసుకోండి.. అభివృద్ధి నిరోధకులుంటరు జాగ్రత్త.. వారిని అధిగమించండి.. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగండి..  కర్తవ్య నిర్వహణలో ముందుండండి.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లకు కర్తవ్య బోధ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ ప్రజాప్రతినిధులకు కర్తవ్య బోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణగా వివరించారు. భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, కమిషనర్‌ సమ్మయ్యలు మున్సిపల్‌ సమ్మేళనానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ వారినుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందన్నారు. “మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మీరు విజయం సాధించాలి.. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభావాలు ఉం టాయి.. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభమైపోయా యి” అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒకప్పుడు రా జకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నవన్నారు. పని చేసే వారికి మంచి పేరు వస్తుందని, ప్రజానాయకుడిగా ఎదిగితే అది జీవితానికి మం చి సాఫల్యమని, అధికారం, హోదా వచ్చాక మని షి మారకూడదన్నారు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని, 5కోట్ల మందిలో 140 మందికి మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని, అది మీ చే తిల్లోనే ఉందన్నారు. విధి నిర్వహణలో వైఫల్యం చెందొద్దన్నారు. పదవి కత్తి మీద సాములాంటిదని, ప్రజా జీవితం అంత సులభం కాదన్నారు. సోయి తప్పి పని చేయవద్దని గుర్తు చేశారు. 

మన రాష్ట్రం ఏర్పడితే మనం బాగుపడతామని పోరాడామని, ప్రజలు తనను రెండుసార్లు సీఎం చేశారని, తన వరకైతే గెలిచేంత వరకే రాజకీయం అని, తర్వాత కాదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థమవుతుందన్నారు. కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశామన్నారు. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నామని, ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలని కోరారు. “పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు.. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి.. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు... ప్రజాశక్తిని మనం సమీకృ తం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధి స్తాం... ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రేపటి నాయకులవుతారు... మీరంతా ధీరులు కావాలి... సంకల్ప బలం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు” అని ముఖ్యమంత్రి చెప్పారు. “మున్సిపాలిటీ అంటేనే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది... అ వినీతికి మారుపేరైంది... బల్దియా... ఖా యా..పీయా.. చల్దియా అనే సామెతలు వచ్చా యి” అని సీఎం అన్నారు. 

ఆ చెడ్డ పేరు పోవాలం టే పారదర్శక విధానాలు అవలంబించాలని, అవినీతి రహిత వ్యవస్థను నిర్మించాలని, పట్టణ ప్రగతి ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. అడ్డదిడ్డండగా, ఎటు పడితే అటు కాదనీ, అవి మీ చేతుల్లోనే ఉం దని సీఎం అన్నారు. ప్రజాప్రతినిధులు బాంబాచారాలు పలుకవద్దని, అన్ని పనులు ఓవర్‌నైట్‌లో చేసేస్తామని మాట్లాడవద్దని, ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్‌ వేసుకోవాలన్నారు. అందుకు మంచి అవగాహన ఏర్పర్చుకోవాలని, సమగ్ర కార్యాచరణను రచించుకొని రంగంలోకి దిగాలన్నారు. అందరినీ కలుపుకొనిపోయి ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలని, ఫొటోలకు ఫోజులివ్వడం తగ్గించి పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. సరిగ్గా అనుకొని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయన్నారు. “ఎప్పుడూ ఇతర దేశాల విజయ గాథలు వినడమే కాదు.. మనమూ.. విజయం సాధించాలి.. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి” అని సీఎం కేసీఆర్‌ ఉద్బోధించారు. అభివృద్ధిపై అధ్యయనంలో భూపాలపల్లి ప్రజాప్రతినిధులు..

హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన మున్సిపల్‌ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, కమిషనర్‌ సమ్మయ్య మిగతా కమిషనర్లు, చైర్‌పర్సన్లు, మేయర్లతో కలిసి గజ్వేల్‌ అభివృద్ధిపై అధ్యయనంలో పాల్గొన్నారు. గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. అక్కడ వెజ్‌, నాన్‌వెజ్‌, షిఫ్‌, పండ్ల మార్కెట్లు, అర్బన్‌ పార్కు, ఫారెస్ట్‌ ప్లాంటేషన్‌, శ్మశాన వాటిక తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించామని, చాలా బాగున్నాయని, గజ్వేల్‌ను ఆదర్శంగా తీసుకొని భూపాలపల్లిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామని చైర్‌పర్సన్‌ వెంకటరాణి, కమిషనర్‌ సమ్మయ్య తెలిపారు. 

పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో  రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సమ్మేళనం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉన్నదన్నారు. బాధ్యతగా పనిచేసి ప్రజల మెప్పు పొందాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, కార్యదీక్షతో పనిచేయాలని హితబోధ చేశారు. సంకల్పం గట్టిగా ఉంటే విజయం వరిస్తుందన్నారు. ఆరు నెలలు కష్టపడితే పట్టణాల రూపురేఖలు మారుతాయన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, కమిషనర్‌ సమ్మయ్య పాల్గొన్నారు. 

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 18 : ‘పట్టణాలు అద్దంలా మెరవాలె.. అభివృద్ధికి పక్కా ప్లాన్లు త యారు చేసుకోండి.. అభివృద్ధి నిరోధకులుంటరు జాగ్రత్త.. వారిని అధిగమించండి.. ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగండి..  కర్తవ్య నిర్వహణలో ముందుండండి.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లకు కర్తవ్య బోధ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపల్‌ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ ప్రజాప్రతినిధులకు కర్తవ్య బోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణగా వివరించారు. భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, కమిషనర్‌ సమ్మయ్యలు మున్సిపల్‌ సమ్మేళనానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేసీఆర్‌ వారినుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందన్నారు. “మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మీరు విజయం సాధించాలి.. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభావాలు ఉం టాయి.. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభమైపోయా యి” అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒకప్పుడు రా జకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నవన్నారు. పని చేసే వారికి మంచి పేరు వస్తుందని, ప్రజానాయకుడిగా ఎదిగితే అది జీవితానికి మం చి సాఫల్యమని, అధికారం, హోదా వచ్చాక మని షి మారకూడదన్నారు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దని, 5కోట్ల మందిలో 140 మందికి మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చని, అది మీ చే తిల్లోనే ఉందన్నారు. విధి నిర్వహణలో వైఫల్యం చెందొద్దన్నారు. పదవి కత్తి మీద సాములాంటిదని, ప్రజా జీవితం అంత సులభం కాదన్నారు. సోయి తప్పి పని చేయవద్దని గుర్తు చేశారు. 

మన రాష్ట్రం ఏర్పడితే మనం బాగుపడతామని పోరాడామని, ప్రజలు తనను రెండుసార్లు సీఎం చేశారని, తన వరకైతే గెలిచేంత వరకే రాజకీయం అని, తర్వాత కాదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థమవుతుందన్నారు. కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశామన్నారు. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నామని, ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలని కోరారు. “పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు.. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి.. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు... ప్రజాశక్తిని మనం సమీకృ తం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధి స్తాం... ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రేపటి నాయకులవుతారు... మీరంతా ధీరులు కావాలి... సంకల్ప బలం గట్టిగా ఉంటే వందశాతం విజయం సాధిస్తారు” అని ముఖ్యమంత్రి చెప్పారు. “మున్సిపాలిటీ అంటేనే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది... అ వినీతికి మారుపేరైంది... బల్దియా... ఖా యా..పీయా.. చల్దియా అనే సామెతలు వచ్చా యి” అని సీఎం అన్నారు. 

ఆ చెడ్డ పేరు పోవాలం టే పారదర్శక విధానాలు అవలంబించాలని, అవినీతి రహిత వ్యవస్థను నిర్మించాలని, పట్టణ ప్రగతి ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. అడ్డదిడ్డండగా, ఎటు పడితే అటు కాదనీ, అవి మీ చేతుల్లోనే ఉం దని సీఎం అన్నారు. ప్రజాప్రతినిధులు బాంబాచారాలు పలుకవద్దని, అన్ని పనులు ఓవర్‌నైట్‌లో చేసేస్తామని మాట్లాడవద్దని, ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్‌ వేసుకోవాలన్నారు. అందుకు మంచి అవగాహన ఏర్పర్చుకోవాలని, సమగ్ర కార్యాచరణను రచించుకొని రంగంలోకి దిగాలన్నారు. అందరినీ కలుపుకొనిపోయి ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలని, ఫొటోలకు ఫోజులివ్వడం తగ్గించి పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. సరిగ్గా అనుకొని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయన్నారు. “ఎప్పుడూ ఇతర దేశాల విజయ గాథలు వినడమే కాదు.. మనమూ.. విజయం సాధించాలి.. మన పట్టణాలను మనమే మార్చుకోవాలి” అని సీఎం కేసీఆర్‌ ఉద్బోధించారు. 

అభివృద్ధిపై అధ్యయనంలో భూపాలపల్లి ప్రజాప్రతినిధులు..

logo
>>>>>>