గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 18, 2020 , 03:33:24

లక్ష్మీ పంప్‌హౌస్‌ టు సరస్వతీ బరాజ్‌

లక్ష్మీ పంప్‌హౌస్‌ టు సరస్వతీ బరాజ్‌

కాళేశ్వరం, ఫిబ్రవరి 17: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నెపల్లి) పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కన్నెపల్లి నుంచి అన్నారం బరాజ్‌కు గడిచిన రెండు రోజుల్లో 3 టీఎంసీల నీటిని ఇంజినీరింగ్‌ అధికారులు విజయవంతంగా ఎత్తిపోశారు. కాగా, 2 నెలల విరామం అనంతరం ఆదివారం ఇంజినీరింగ్‌ అధికారులు కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద ఉదయం 5 మోటర్లను విజయవంతంగా రన్‌ చేశారు. తిరిగి రాత్రి 8 గంటల ప్రాంతంలో మరో 6 మోటార్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ ఒక్కరోజే కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి అన్నారం బరాజ్‌కు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. కాగా, సోమవారం సైతం ఇంజినీరింగ్‌ అధికారులు మళ్లీ 5 మోటర్లను వినియోగంలోకి తీసుకవచ్చారు. పంప్‌ హౌస్‌లోని 1, 3, 4, 5, 7వ మోటర్లను రన్‌ చేయడంతో సోమవారం 1 టీఎంసీ నీటిని గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం బరాజ్‌కు తరలించారు. గోదావరి జలాలు రివర్సింగ్‌ పద్ధతిలో పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోయడం, గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం బరాజ్‌కు తరలుతున్న నీటిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.


logo
>>>>>>