గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 17, 2020 , 03:54:04

సొసైటీల్లో గులాబీ జెండా

సొసైటీల్లో  గులాబీ జెండాభూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 16 : సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. జిల్లాలోని 11మండలాల్లో ఉన్న 10 పీఏసీఎస్‌లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనకు రైతులు జై కొట్టారు. 10పీఏసీఎస్‌ చైర్మన్లతోపాటు 8వైస్‌ చైర్మన్లను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకుంది. జిల్లాలో ఉన్న మంథని నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల్లో సైతం టీఆర్‌ఎస్‌ పాగా వేసింది. గడిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో బలం చూపించినప్పటికీ సహకార ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌ పార్టీని ఛీ కొట్టారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలిపారు. ఈ క్రమంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సహకార సంఘం ఎన్నికలు టీఆర్‌ఎస్‌ బలాన్ని గుర్తు చేశాయి. 


జై కొట్టిన రైతులు..

సహకార సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పాలనకు రైతులు జై కొట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రైతులకు ఎంతగానో మేలు చేశాయి. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు.. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో రైతులు లబ్ధి పొందుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24గంటల ఉచిత కరెంట్‌ను రైతులు మరిచిపోలేకపోతున్నారు. పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం అనేక మంది రైతులకు ఆర్థికంగా సహాయం అందిస్తోంది. ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కుటుంబాలకు రైతుబీమా అండగా నిలుస్తుంది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అనతికాలంలోనే విజయవంతంగా పూర్తయి రైతులకు కల్పతరువుగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్‌ ఆలోచనలతో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు జీవం పోసుకుంటుంది. ఇలా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రైతుల గుండెల్లో నిలిచిపోయాయి. దీంతో రైతులు సహకార ఎన్నికల్లో పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. 


logo