సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 16, 2020 , 03:31:38

జల పరవళ్లు..

జల పరవళ్లు..

కాళేశ్వరం, ఫిబ్రవరి 15: తెలంగాణ జీవధార గోదావరి జలాలు పర వళ్లు తొక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌజ్‌లో మోటర్లు శనివారం ఉదయం పునః ప్రారంభమయ్యాయి. రెండు నెలల విరామం తర్వాత మళ్లీ పంప్‌హౌస్‌ నుంచి గోదావరమ్మ ఉప్పొంగి ప్రవహించింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని నాలుగు మోటర్లను ఇంజినీరింగ్‌ అధికారులు శనివారం ఉదయం ఆన్‌ చేశారు.  మొదట 4 మోటర్లను నడి పించారు. సాయంత్రం సమ యంలో 1 నుంచి 11వ నంబర్‌ వరకు మొత్తం 11 మోటార్లను ఆన్‌చేశారు. దీంతో ఆ జలాలు డెలివరీ సిస్టర్న్‌ వద్ద గ్రావిటీ కెనాల్లో పోస్తూ అన్నారం బరాజ్‌కు పరుగులు తీశాయి. పంప్‌హౌజ్‌లోని 11 మోటర్లను నడిపించి మొత్తంగా 2 టీఎంసీల నీటిని అన్నారం బరాజ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనది కన్నెపల్లి పంప్‌ హౌస్‌. 


ఈ పంప్‌హౌస్‌ ప్రారంభ దశలోనే ఇంజినీరింగ్‌ అధికారులు మోటర్లను వినియోగంలోకి తీ సుకొచ్చారు. మోటర్లన్నింటినీ ఒకే దఫాలో నడిపించి విజయం సాధించారు. పంప్‌ హౌస్‌ నుంచి సరస్వతీ బరాజ్‌కు, అక్కడి నుంచి పార్వతీ బరాజ్‌కు భారీగా నీటిని తరలించడంతో ఒక్కసారిగా గోదావరి నిండుకుండలా మారింది. గోదావరి పొడవునా నదీజలాలు భారీ స్థాయిలో నిల్వ ఉన్నాయి. బ్యాక్‌ వాటర్‌తో జీవనది కళకళలాడింది. దీంతో పంప్‌హౌస్‌ వద్ద మోటర్లను నిలిపివేశారు. రెండు నెలల విరామం తర్వాత ఇంజినీరింగ్‌ అధికారులు శనివారం నుంచి మొదటగా 5 మోటార్లను వినియోగంలోకి తేవడంలో సక్సెస్‌ అయ్యారు. రాత్రి వరకు మరో 6 మోటర్లను రన్‌ చేసి మొత్తం 11 మోటర్లతో సరస్వతీ బరాజ్‌కు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిని పర్యవేక్షిస్తున్నారు.


logo