మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 15, 2020 , 02:28:53

ప్రతి వార్డులో ఆఫీసు ఉండాలి

ప్రతి వార్డులో ఆఫీసు ఉండాలి

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 14 : భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 18వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18వ వార్డు కౌన్సిలర్‌ నాగుల శిరీషాదేవేందర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని కౌన్సిలర్లు వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వార్డు కార్యాలయంలో ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించినప్పుడు పుస్తకంలో రాసుకొని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని, మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి మున్సిపల్‌ సబ్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని, అక్కడి నుంచి మున్సిపల్‌ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ జరుగుతుందన్నారు. అదేవిధంగా జంగేడు, వేశాలపల్లి, పుల్లూరిరామయ్యపల్లి, కాసింపల్లి గ్రామాల్లో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలను వార్డు డిస్ట్రిబ్యూషన్‌ కార్యాలయాలుగా మార్చుకోవాలని కోరారు.


వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ నాగుల శిరీషాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యేను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వార్డు ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>