శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 15, 2020 , 02:24:09

మేడారం ఆదాయం రూ.ఐదు కోట్లు

మేడారం ఆదాయం రూ.ఐదు కోట్లు
  • మూడు రోజుల్లో సమకూరిన మొత్తం ఇది..
  • ఇప్పటి వరకు 194 హుండీల లెక్కింపు

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 13: మేడారం జాతరలో భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీల లెక్కింపు మూడో రోజు కొనసాగింది. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో అధికారులు శుక్రవారం 65 హుండీలను లెక్కించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు లెక్కించగా, రూ. 2,70,16,000 ఆదాయం వచ్చినట్లు మేడారం ఆలయ ఈవో తమ్మ రాజేంద్రం వెల్లడించారు. తొలిరోజు 64 హుండీలను లెక్కించగా రూ. 1,01,50,000, రెండో రోజు 65 హుండీల లెక్కింపు ద్వారా రూ. 1,91,26,000 ఆదాయం వచ్చిందన్నారు. మూడో రోజుతో కలుపుకుని మొత్తం రూ. 5,62,92,000 ఆదాయం సమకూరినట్లు వివరించారు. గత జాతరలో రూ. 10 కోట్లు రాగా, ఈసారి హుండీ ఆదాయం రూ. 10 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చుట్టూ సీసీ కెమెరాలు, పోలీసు సిబ్బంది భద్రతతో చేపట్టిన లెక్కింపులో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.


logo