గురువారం 13 ఆగస్టు 2020
Jayashankar - Feb 14, 2020 , 04:21:35

కాళేశ్వరంలో జల తపస్వి

కాళేశ్వరంలో జల తపస్వి

సజీవ జలధార.. అపర భగీరథుడి కలల పంట.. పడావు పడిన బీడు భూముల్లో పసిడి కాంతుల్ని నింపిన జలనిధి.. లక్ష్మీబరాజ్‌ నుంచి కాళేశ్వరం దాకా, దాదాపు 16కిలో మీటర్ల మేర నిండు కుండలా మారిన గోదావరిని గగన తలం నుంచి వీక్షించి సీఎం కేసీఆర్‌ పులకించిపోయారు. తల్లిగోదావరికి తన్మయత్వంతో వందనం చేశారు. నిండు మనసుతో తెలంగాణ భూముల్ని మాగాణం చేయాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం అపురూప జలదృశ్యం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరానికి చేరుకున్న ఆయన, ముందుగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలను 

తల మీద చల్లుకొని, నాణేలు వదిలి జల నీరాజనాలు 

అర్పించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు.  ఆలయ అభివృద్ధిపై అర్చకులతో చర్చించారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌ ద్వారా లక్ష్మీబరాజ్‌ను వీక్షించారు. బరాజ్‌ వంతెనపై నుంచి వెళ్లి నదీమాతకు నాణేలు, పూలు, పండ్లు, నూతన వస్ర్తాలు సమర్పించి పూజలు చేశారు. వ్యూపాయింట్‌ నుంచి బరాజ్‌ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. logo