సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 14, 2020 , 04:16:24

ఉత్సాహంగా సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ

ఉత్సాహంగా సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ

వరంగల్‌స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 13:  కేసీఆర్‌ క్రికెట్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నీ ఉత్సాహంగా సాగుతుంది. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడా ప్రాంగణం వేదికగా వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈపోటీల్లో  వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని 32 జట్లు టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈనెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యువతలో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ఈపోటీలను ఛీప్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌వీ బాధ్యులు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పోటీల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 18జట్లు తలపడినట్లు నిర్వహణ కమిటీ కన్వీనర్‌ మార్నేని ఉదయభానురావు, టీఆర్‌ఎస్‌వీ కేయూ అధ్యక్షులు ప్రశాంత్‌ తెలిపారు. గురువారం జరిగిన మ్యాచ్‌ లు సీనియర్‌ క్రికెటర్‌ పారూఖ్‌, సీనియర్‌ అంఫైర్‌ మట్టె డ కుమార్‌, టీఆర్‌ఎస్‌వీ బాధ్యులు రంజిత్‌, రాకేశ్‌, వీరు, సుమన్‌, రాంబాబు, సునీల్‌, ప్రకాశ్‌, విజయ్‌, శ్రీకాంత్‌, నరేందర్‌, ప్రవీణ్‌, ప్రణయ్‌, శ్రావణ్‌, కార్తీక్‌ల పర్యవేక్షణలో జరిగాయి.

ఉత్సాహంగా పోటీలు..

వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో తలపడుతున్న ఆయా డివిజన్‌ జట్టు సభ్యులు ఉత్సాహంగా మ్యాచ్‌ల్లో తలపడుతున్నారు. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూనే పోరాట పటిమతో తమ జట్టు విజయం కోసం మైదానంలో తమ ప్రతిభను చాటుతున్నారు. క్రీడామైదానంలో 3పిచ్‌లు వేయడంతో ఉదయం నుంచి సా యంత్రం వరకు ఎలాంటి విరామం లేకుండా మ్యా చ్‌లు జరుగుతూనే ఉన్నాయి. అలాగే, హాజరైన క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాం లేకుండా నిర్వహణ స భ్యులు అన్ని ఏర్పాట్లను మైదానంలో అందుబాటులోకి తేవడంతో క్రీడాకారులు ఉత్సాహంతో ఆడుతున్నారు. 

మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి..

F  మొదటిమ్యాచ్‌లో తలపడిన 32 డివిజన్‌(ఏ) జట్టుపై 46పరుగులు ఆధిక్యంతో  37డివిజన్‌ జట్టు ఘన విజయం సాధించింది. సయ్యద్‌(41పరుగులు) చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

F రెండో మ్యాచ్‌లో  32 డివిజన్‌(బీ) జట్టుపై 2వికెట్ల తేడాతో 31 డివిజన్‌(బీ) జట్టు విజయం సాధించిం ది. సాయికుమార్‌ 2వికెట్లు, 22పరుగులు చేసి   మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

F మూడో మ్యాచ్‌లో  52వ డివిజన్‌ జట్టు 4పరుగుల 

తేడాతో 44వ డివిజన్‌ జట్టుపై నెగ్గింది. ప్రవీణ్‌ 2

ఓవర్లు వేసి 5వికెట్లు తీసి మ్యన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

4వ మ్యాచ్‌లో  34వ డివిజన్‌ జట్టు 10 పరుగుల ఆధిక్యంతో 30వ డివిజన్‌ జట్టుపై విజయం సాధించింది. 

 5వ మ్యాచ్‌లో  46వ డివిజన్‌ జట్టు 2వికెట్ల తేడాతో 34వ డివిజన్‌(ఏ) జట్టుపై నెగ్గింది. మాధవ్‌ 21 బంతుల్లో 24పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

7వ మ్యాచ్‌లో 50వ డివిజన్‌ జట్టు 37పరుగుల ఆధిక్యంతో 38వ డివిజన్‌ జట్టుపై విజయం సాధించింది. హరి 25బంతుల్లో 45పరుగులు చేసి జట్టుకు విజయం సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

8వ మ్యాచ్‌లో 53వ డివిజన్‌ జట్టు 28 పరుగుల తేడాతో 43వ డివిజన్‌ జట్టుపై నెగ్గింది. సాయి వంశీరాం 2ఓవర్లు వేసి 5వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

9వ మ్యాచ్‌లో తలపడిన 42వ డివిజన్‌ జట్టు 4వికెట్ల తేడాతో 30వ డివిజన్‌ జట్టుపై విజయం సాధించింది. ఇందులో ప్రదీప్‌ 33పరుగులు చేయడంతో పాటు 4వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌ ప్రతిభతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.


logo