ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Feb 13, 2020 , 03:56:51

పీఆర్‌ సమ్మేళన్‌ బాధ్యత మంత్రులకు..

పీఆర్‌ సమ్మేళన్‌ బాధ్యత మంత్రులకు..
  • ఎర్రబెల్లికి జనగామ, జయశంకర్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు
  • ఈ నెల 25లోగా సమావేశాలు నిర్వహణ
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • సత్యవతిరాథోడ్‌కు వరంగల్‌ అర్బన్‌, మహబూబాద్‌, ములుగు జిల్లాలు

మడికొండ, ఫిబ్రవరి 12: వరంగల్‌లో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలు సఫలం అవుతున్నాయని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తుల మేరకు వరంగల్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే యజ్ఞంలో ఒక్కో కంపెనీ భాగస్వామ్యం అవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన సైయంట్‌, టెక్‌ మహేంద్ర కార్యకలాపాలు సాగిస్తుండగా మరో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ కూడా వరంగల్‌లో తన సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. తాజాగా 1.5 ఎకరాల్లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సంస్థ ఏర్పాటుకు ముందుకు రావడం హర్షనీయమని అన్నారు.  


‘క్వాడ్రంట్‌' ఏర్పాటుపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

వరంగల్‌లో ఐటీ కంపెనీ క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయడంపై ఐటీ మంత్రి కేటీఆర్‌ బుధవారం తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఫిబ్రవరి 16న క్వాడ్రంట్‌ రిసోర్స్‌ తన ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు పునాది వేయనుందని ఆయన తెలిపారు. 1.5 ఎకరాల స్థలంలో 500 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా సెంటర్‌ను రూపొందించడంపై కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో, ఎన్నారై వంశీరెడ్డికి ధన్యవాదాలు అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


logo