గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 12, 2020 , 02:12:22

అనతికాలంలో అద్భుత ప్రగతి

అనతికాలంలో అద్భుత ప్రగతి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 11 : రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలుకు జిల్లా యం త్రాంగం ప్రాధాన్యతనివ్వాలని, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొద్దని సీఎం కే చంద్రశేఖర్‌రావు కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లకు ఉద్బోధించారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం ఉదయం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మేధోమథనం, చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తున్నదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమా ల అమలు, కలెక్టర్ల ప్రాధాన్యత కావాలన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలో అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని, సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. రూ.40వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం ఉండేదని, చాలా తక్కువ సమయంలోనే విద్యుత్‌ సమస్యను అధిగమించి నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపామన్నారు. ఇది గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో వేసవి వస్తుందంటే ప్రజలు మంత్రులు, కలెక్టర్ల ఎదుట బిందెలతో ప్రదర్శనలు చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని గుర్తుచేశారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం-పరిశుభ్రతతో కళకళలాడాలని సూచించారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యతను వారు ఎంచుకోవద్దని, అధికార యంత్రాం గం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చినవి కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, కంటి వెలుగు తదితర పథకాలు అని, వాటిని కలెక్టర్లు పకడ్బం దీగా అమలు చేయాలన్నారు. కలెక్టర్‌ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని, కలెక్టర్లకు అండగా అడిషనల్‌ కలెక్టర్లను నియమించిందని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి గా కలెక్టర్‌ వ్యవహరించాలని, కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో న మ్మకం ఉంచిందని, అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్య త ఉందన్నారు. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరించేవారని, ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మా ర్చామని, దీంతో పని ఒత్తిడి తగ్గుతుందన్నారు.


పల్లె ప్రగతి నిరంతరం సాగాలని ఆకాంక్షించారు. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలని, వాటిని సంరక్షించాలని, గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలని సూచించారు. మురుగుగుంతలు, చెత్తా చెదారం తొలగించాలని, పాడుబడిన బావులు, పాత బోరు బావులను పూడ్చివేయాలన్నారు. ఈ పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో  పరిపాలన పరిధి తగ్గిందని వివరించారు. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి సానుకూల అంశమని, పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య రాకుండా ప్రతినెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నామని, అన్ని గ్రామాలకు కార్యదర్శులను నియమించామన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీఎల్‌పీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈవో తదితర పోస్టులను భర్తీ చేశామన్నారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచామని, ప్రతి గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించామన్నారు. విధు ల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని, నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తన అధికారాలను వదులుకొని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసిందని, ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందన్నారు. గ్రామాల్లో మార్పు రాకుంటే చూస్తూ ఊరుకోదని, ఎవరి బాధ్యతలను వారు నెరవేర్చేలా పని చేయించే బాధ్యతలను కలెక్టర్లు తీసుకోవాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్లలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించామని, వారికి మరో పని అప్పగించవద్దన్నారు. 15 రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని, సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఆహ్వానించాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతిని, ఎవరి బాధ్యత ఏమిటో విడమర్చి చెప్పాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలని, ఈ సమ్మేళనంలో విధు లు, బాధ్యతలు చెప్పాలని, సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలన్నారు. ఈ గడువులోగా గ్రామాల రూపురేఖలు మార్చాలన్నారు. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ పర్యటిస్తాయన్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ఆకస్మిక పర్యటనలు చేసి ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా, చర్యలు తీసుకుంటానని, గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తానని వెల్లడించారు. దేశంలో ఆదర్శ పల్లెలు తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలన్నారు. గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులను పూర్తి చేయాలని కోరారు. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తి పోయడానికి ట్రాక్టర్లను కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర అత్యంత ప్రాముఖ్యత ఉన్న పనులు చేయడానికి ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి చొప్పున అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడమే కాదని, అడవుల్లో కలప స్మగ్లింగ్‌ను అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని, చెట్లు నరకకుండా చూడాలని, అటవీ భూముల్లో దట్టమైన అడవిని అభివృద్ధి చేయాలని సూచించారు. హైదరాబాద్‌, గద్వాల, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌, యా దాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవుల శాతం తక్కువగా ఉందని, అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొక్క లు నాటడం, వాటిని సంరక్షించడం, మంత్రులు, కలెక్టర్ల బాధ్య త అని, వారి పనితీరుకు ఇదే గీటు రాయని తెలిపారు. మొ క్కలు నాటి సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదన్నారు. ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలన్నారు. తండాలు, గూడేల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలని సూచించారు. పంచాయతీరాజ్‌ శాఖలో దాదాపు ఖాళీలన్నింటినీ భర్తీ చేశామని, ఇంకా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతిని ప్రారంభిస్తామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మాదిరిగా మున్సిపల్‌ శాఖలో అన్ని ఖాళీలనూ భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్ని ఖాళీలు, ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గతంలో కేవలం ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉంటే వాటిని 13కు పెంచామని, మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 128కి చేసుకున్నామన్నారు. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు సమకూరుస్తున్నామని, హైదరాబాద్‌ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నామని, ఈ నిధులతో పాటు స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి, కాలుష్యాన్ని నివారించడానికి ప్రణాళిక రూపొందించాలని,  డీజిల్‌ వాహనాలు తగ్గించి ఎలక్ట్రానిక్‌ వాహనాల సంఖ్యను పెంచాలన్నారు. అక్షరాస్యత విషయంలో తెలంగాన వెనుకబడి ఉన్నదని, నిరక్ష్యరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలని, జిల్లా పూర్తిగా అక్షరాస్యత సాధించేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు.  ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యతను పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంత్రు లు, సీనియర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>