ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Feb 12, 2020 , 02:06:24

ముస్తాబవుతున్న వీరభద్రుడి ఆలయం

ముస్తాబవుతున్న వీరభద్రుడి ఆలయం

కురవి, ఫిబ్రవరి 11: ఈనెల 20వ తేదీ అంకురార్పణతో మొదలయ్యే ఉత్సవాలకు భద్రకాళీ సమేత  వీరభద్రస్వామి ఆలయం సుందరంగా తయారవుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగే కల్యాణానికి లక్షకు పైగా భక్తులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు పనులను శరవేగంగా చేయిస్తున్నారు. ఇప్పటికే భద్రకాళీ అమ్మవారి ఆలయం, స్వామి ఆలయంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. రంగులు వేసే పనుల్లో వేగం పెంచారు. మొన్నటి వరకు మేడారం పనుల్లో బిజీగా ఉండి ఇటీవలే ఆలయానికి వచ్చిన అధికార యంత్రాంగం కురవి ఉత్సవాల విజయవంతానికీ కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఒకసారి సమీక్షించారు. జాతర పనులను త్వరగా పూర్తి  చేయాలని అధికారులను ఆదేశించారు. 

నేడు సమీక్ష 

వీరభద్రస్వామి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఆలయ అధికారులతో ఎమ్మెల్యే రెడ్యా సమీక్షించనున్నట్లు కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ సమీక్షకు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారు. కురవి నాగ మయ్య దేవస్థానంలో ఉదయం 11గంటలకు జరిగే సమీక్షకు  అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఈవో కోరారు.


logo