గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 10, 2020 , 02:44:36

అకాల వర్షంతో మిర్చి రైతుల ఆందోళన

అకాల వర్షంతో మిర్చి రైతుల ఆందోళన

ఏటూరునాగారం : మండలంలో  కురిసిన అకాల వర్షానికి మిర్చి రైతులకు నష్టం వాటిల్లింది. మిర్చి కోతకు వచ్చే సమయంలో కురుస్తున్న వర్షం తమకు నష్టం మిగిల్చిందని  రైతులు అంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు కోత పట్టి కల్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షంతో తడిసింది. పలు చోట్ల రైతులు టార్పాలిన్‌ షీట్లు వేసి కాపాడుకునే ప్రయత్నం చేశారు.


కన్నాయిగూడెంలో..

కన్నాయిగూడెం : మండలంలో కురిసిన భారీ వర్షం మి ర్చి పంటకు తీరని నష్టాన్ని మిగిల్చిం ది. కోసి కల్లాల్లో ఆ రబోసిన మిర్చి తడి సి ముద్దయింది. శ నివారం రాత్రి మొ దలైన వర్షం ఆదివారం ఉదయం వరకు పడటంతో ఒర్రెలు నిండి వాగులు ప్రవహించాయి. దీంతో పంట చేన్లు నీటితో నిండి మిర్చి కల్లాల్లోకి వరద నీరు చేరడంతో తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు. 


logo