గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 10, 2020 , 02:30:38

తడిసి ముద్దయిన మిర్చి

తడిసి ముద్దయిన మిర్చి

మంగపేట : మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి గ్రేడింగ్‌ చేయడానికి కల్లాల్లో ఆరబోసుకున్న మిర్చి పం ట తడిసిపోయింది. మొదటి దఫా కోసిన మేలు కాయలన్నీ తడిసిముద్దవండతో రంగు మారే అవకాశం ఉందని రై తులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మండలంలోని గోదావ రి పరివాహక గ్రామాలైన కమలాపురం, బోరునర్సాపురం, మల్లూరు, తిమ్మంపేట, వాడగూడెం, రాజుపేట తదితర గ్రామాల శివారు చేనుల్లో  పెద్దఎత్తున రైతులు మిర్చి సాగు చేశారు. ఈ సీజన్‌లో తెగుళ్ల బారిన పడి 30శాతం మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. తెగుళ్లను తట్టుకొని పండిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా చెడగొట్టు వాన కల్లాల్లోని మిర్చి పంటను దెబ్బతీయడంతో రైతులు ఒక్కసారిగా అ యోమయంలో పడిపోయారు. మరోవారం రోజుల్లో మా ర్కెట్‌కు తరలించే మిర్చి ఇలా వర్షంలో తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తోటల్లో కోతకు సిద్ధంగా ఉన్న మిర్చి కూడా ఈ వర్షానికి దెబ్బతినే అవకాశముందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం టార్పాలిన్‌ షీట్లు ఉచితంగా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. 


logo