గురువారం 09 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 09, 2020 , 02:04:10

‘కోటి’ మొక్కులతో తల్లుల సంతృప్తి

‘కోటి’ మొక్కులతో తల్లుల సంతృప్తి

వరంగల్‌, నమస్తే తెలంగాణ : రెండేళ్లకోసారి  వనం నుంచి జనంలోకి వచ్చే వనదేవతలు భక్తకోటి మొక్కులకు సంతృప్తి చెందారు. నమ్ముకున్న భక్తులపై ఆ తల్లులు తమ చల్లని చూపు చూపారు. నాలుగు రోజుల మహాజాతరలో వన దేవతలను దర్శించుకుని తిరుగు పయనమైన భక్తులపై చిరు జల్లులు కురిపించి తమ చల్లని కరుణను చూపారు. రెండేళ్ల ఎదురుచూపుల తర్వాత దీవెనలు అందించేందుకు జనంలోకి వచ్చిన వనదేవతలు భక్త కోటికి వరుణ సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో  మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. స్వరాష్ట్రంలో  జరుగుతున్న మూడవ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తల్లులను కనులారా దర్శించుకున్నారు. తిరిగి వెళుతున్న భక్తులపై చిరు జల్లులు కురిపించి తల్లులు తమ చల్లని కరుణ చూపారు. 


logo