బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 09, 2020 , 01:59:35

అమ్మవార్ల చరిత్ర ప్రపంచానికి తెలియాలి

అమ్మవార్ల చరిత్ర ప్రపంచానికి తెలియాలి

తాడ్వాయి, ఫిబ్రవరి 8 : భక్తకోటికి ఆ రాధ్యదేవతలైన సమ్మక్క-సారలమ్మ తల్లు ల చరిత్ర ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉందని గ్రామీణాభివృద్ధి, పం చాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న తాడ్వాయి మండలం కామారానికి చెందిన మైపతి అరుణ్‌కుమార్‌ గత ఆరేళ్లుగా మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరి స్సా, తెలంగాణ రాష్ర్టాల్లో క్షేత్రపర్యటన చే సి రచించిన సమ్మక్క-సారలమ్మల పూ ర్వ చరిత్ర పుస్తకాన్ని మంత్రి ఎర్రబెల్లి, ము లు గు ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తితో కలిసి తల్లుల గద్దెల ఆవరణలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక పురావస్తు ఆధారాలు, గోండ్వాన రాజ్య మూలాలు ఈ పుస్తకం లో ఉన్నాయని తెలిపారు. పుస్తక రచయిత అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం అమ్మల చరిత్రను భావి తరరాలకు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బిర్సాముండా యూత్‌ అధ్యక్షుడు రేగ రాజశేఖర్‌, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమి టీ కార్యదర్శి సిద్ధబోయిన కార్తీక్‌, గోవిందరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క దేవత పూజారులు పాల్గొన్నారు. 


logo
>>>>>>