ఆదివారం 24 మే 2020
Jayashankar - Feb 08, 2020 , 02:58:47

రెండోరోజు నామినేషన్ల జోరు

రెండోరోజు నామినేషన్ల జోరు

భూపాలపల్లి టౌన్‌, ఫిబ్రవరి 7 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సహకార ఎన్నికల నామినేషన్ల పర్వం రెండోరోజు జోరుగా కొనసాగింది. జిల్లాలో సహకార సంఘం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం వరకు రెండు రోజుల్లో మొత్తం 244 నామినేషన్లు దాఖలయ్యాయి. రేగొండ మండలంలో 36, గణపురం మండలంలో 28, చిట్యాలలో 26, మొగుళ్లపల్లిలో 33, జంగేడులో 30, గారపల్లిలో 25, మహదేవ్‌పూర్‌లో 29, చెల్పూర్‌లో 16, తాడిచర్లలో 17, మహాముత్తారం మండలంలో 4 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. కాగా, శనివారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. 

గణపురంలో..

గణపురం : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల హడావిడి మొదలైయింది. పల్లెల్లో రాజకీయ వేడెక్కింది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రాథమిక సహకార సంఘాలను కైవసం చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తమకున్న శక్తియుక్తులను క్రోడికరించి రంగంలోకి  దిగేందుకు సమాయత్తమవుతున్నారు. నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభంకాగా మండలంలోని గణపురం, చెల్పూర్‌ సొసైటీలకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు గణపురం 28, చెల్పూర్‌ సొసైటీలో 16 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం వరకు గడువు ఉండడంతో ఆశావహులు నామినేషన్ల దాఖలుకు ఆరాటపడుతున్నారు. 

నేటితో గడువు పూర్తి..

ఆయా సహకార సంఘాల డైరెక్టర్లుగా నామినేషన్‌ వేసుకునేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఇచ్చిన గడువు శనివారంతో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణకు 6,7,8 తేదీల్లో గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. చివరిరోజు శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు మాత్రమే ఆయా సొసైటీల ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం నామినేషన్లు స్వీకరించేందుకు అవకాశం ఉండదు. 9వ తేదీన సొసైటీ ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. 10వ తేదీన నామినేషన్లు వేసిన అభ్యర్థులకు  ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే రోజున బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు తెలుగు అక్షర క్రమపద్ధతిలో గుర్తులను కేటాయిస్తారు. నామినేషన్లు వేసేందుకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

మల్హర్‌లో..

మల్హర్‌ : తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజు జోరుగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల అధికారి శంకరయ్య తెలిపారు. రెండు రోజుల్లో 13 స్థానాలకు మొత్తం 17 నామినేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా, మొదటి డైరెక్టర్‌ (ఓసీ) స్థానానికి రెండు నామినేషన్లు, రెండో స్థానానికి (ఓసీ) 2 నామినేషన్లు, మూడో డైరెక్టర్‌ (ఓసీ) స్థానానికి 3 నామినేషన్లు, 4వ డైరెక్టర్‌ (బీసీ) స్థానానికి 3 నామినేషన్లు, 5వ డైరెక్టర్‌ (ఓసీ)స్థానానికి ఒకటి, 10వ డైరెక్టర్‌ (ఓసీ) స్థానానికి ఒకటి, 12వ డైరెక్టర్‌ (బీసీ), స్థానానికి 3 నామినేషన్లు, 13వ డైరెక్టర్‌ (ఎస్టీ) స్థానానికి ఒకటి చొప్పున నామినేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. 

మొగుళ్లపల్లిలో..

మొగుళ్లపల్లి : మండలంలో ఈ నెల 15 న జరిగే సహకార సంఘం ఎన్నికలకు రెండో రోజు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు ఆరు నామినేషన్లు వచ్చాయి. కాగా, రెండో రోజు 21తో మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

కాటారంలో..

కాటారం : మండలంలోని గారెపల్లి(కే) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి రోజు 5 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 20 నామినేషన్లను స్వీకరించినట్లు ఎన్నికల అధికారి సతీశ్‌, పీఏసీఎస్‌ సీఈవో ఎడ్ల సతీశ్‌ శుక్రవారం తెలిపారు. గారెపల్లి సహకార సంఘంలోని 13 నియోజకవర్గాలకుగాను 2వ నియోజకవర్గం నుంచి 4 నామినేషన్లు, 4వ నియోజకవర్గం నుంచి 2 నామినేషన్లు, 7వ నియోజకవర్గం నుంచి 3, 9వ నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్‌, 10వ నియోజకవర్గం నుంచి 2 నామినేషన్లు, 11వ నియోజకవర్గం నుంచి 5 నామినేషన్లు, 12వ నియోజకవర్గం నుంచి 2 నామినేషన్లు, 13వ నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్‌ వచ్చినట్లు తెలిపారు. 2వ నియోజకవర్గంలో నిడిగొండ సత్యనారాయణ, జక్కుల ఐలయ్య, బొంపెల్లి రాజేందర్‌, వీరగంట సమ్మయ్య, 4వ నియోజకవర్గంలో అయిలి రాజబాపు, చీర్ల రాజిరెడ్డి, 7వ నియోజకవర్గంలో అజ్మీరా రాజు, అంగోతు బన్సీలాల్‌ రెండు నామినేషన్లు, 9వ నియోజకవర్గంలో తిప్పిరి రజిత, 10వ నియోజకవర్గంలో ఆత్మకూరి స్వామియాదవ్‌, కల్కి కొమురయ్య, 11వ నియోజకవర్గంలో గోనె రాజయ్య, కటుకు రామయ్య రెండు నామినేషన్లు, వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, అయిత రాజిరెడ్డి, 12వ నియోజవర్గంలో ఆరెల్ల సదానందం, వెనుగంటి తిరుపతిరెడ్డి నామినేషన్లను సమర్పించినట్లు వారు తెలిపారు. 

మహాముత్తారం పీఏసీఎస్‌లో..

మహాముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజున 4 నామినేషన్లను స్వీకరించినట్లు ఎన్నికల అధికారి ప్రభావతి, పీఏసీఎస్‌ సీఈవో మార్క శ్రీధర్‌ తెలిపారు. మహాముత్తారం సహకార సంఘంలోని 13 నియోజకవర్గాలకుగాను 1వ నియోజకవర్గం నుంచి కొరుకొప్పుల లింగయ్య, 9వ నియోజకవర్గం నుంచి వేల్పుల సమ్మక్క, 12వ నియోజకవర్గం నుంచి మహ్మద్‌ అల్లాఉద్దీన్‌, 13వ నియోజకవర్గం నుంచి కొడపర్తి శ్రీశైలం నామినేషన్లను సమర్పించినట్లు వారు తెలిపారు. 


logo