శనివారం 04 ఏప్రిల్ 2020
Jayashankar - Feb 08, 2020 , 02:47:09

గట్టమ్మకు ఆనవాయితీ మొక్కులు

గట్టమ్మకు ఆనవాయితీ మొక్కులు

ములుగురూరల్‌, ఫిబ్రవరి07 :  మేడారం వెళ్లే ప్రతి గాడీ గట్టమ్మ వద్ద ఆగాల్సిందే.. ఇది సమ్మక్క జాతర ఆనవాయితీ.. ములుగు జిల్లా కేంద్రం జాకారం గ్రామపంచాయతీ  పరిధిలోని గట్టమ్మ తల్లి వద్ద మేడారం భక్తుల మొక్కులు కొనసాగుతున్నాయి. సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువైన సందర్భంగా మొక్కులు తీర్చుకునే రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో మేడారానికి తరలివెళ్లారు. గట్టమ్మ వద్ద ఆనవాయితీ ప్రకారం మొక్కులను సమర్పించారు. ఆలయ ఆవరణలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దెలకు పూజలు చేశారు. అనంతరం మేడారానికి తరలివెళ్లారు.  గట్టమ్మ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి పార్కింగ్‌ స్థలాలకు వాహనాలను తరలించారు. 


logo