సోమవారం 30 మార్చి 2020
Jayashankar - Feb 07, 2020 , 02:57:50

పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రులు

పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రులు

మేడారం బృందం, నమస్తేతెలంగాణ: మేడారం మహా జా తర సందర్భంగా చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, స త్యవతి రాథోడ్‌, జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌తో కలిసి పరిశీలించారు. తొలుత గద్దెల వద్ద, ప్రధాన రహదారి వెంట ఉన్న దుకాణాల్లో పారిశుధ్యం, ప్లాస్టిక్‌ నివారణ చర్యలను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌ బస చేసే వసతిగృహాన్ని, హెలీప్యాడ్‌ను ప రిశీలించారు. అనంతరం హెలీకాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం చేశారు. జంపన్నవాగు, తల్లుల గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదే శించారు. అనంతరం గిరిజనశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ మ్యూజి యాన్ని సందర్శించారు. సమ్మక్క, సారలమ్మ వాడిన కత్తులు, వస్తువులు, నాటి దు స్తులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాన్ని పరిశీలించారు. మంత్రుల వెంట గిరిజనశాఖ కమిషనర్‌ క్రిస్టినా ఉన్నారు.


logo